News January 31, 2025
సీఎంతో కోట్ల ఫ్యామిలీ

విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడును గురువారం డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజవర్గంలో రాజకీయ పరిస్థితులు, జరుగుతున్న అభివృద్ధి గురించి సీఎంకు వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం సూచించినట్లు వారు తెలిపారు. అలాగే కోట్ల ఆరోగ్య పరిస్థితిని సీఎం అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
Similar News
News November 3, 2025
SRCL: పెద్దింటి అశోక్ కుమార్‌కు జీవన సాఫల్య పురస్కారం

సిరిసిల్ల పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సినీ గేయ రచయిత అయిన పెద్దింటి అశోక్ కుమార్‌కు ‘అమృత లత జీవన సాఫల్య పురస్కారం-2025’ లభించింది. నిజామాబాద్‌లోని అపురూప అవార్డు బృందం వారు ఆదివారం ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేశారు. ఆయన సాహిత్యంపై ఇప్పటివరకు వివిధ యూనివర్సిటీల నుంచి ఐదు ఎంఫిల్, నాలుగు పీహెచ్‌డీ పట్టాలు రావడం విశేషం.
News November 3, 2025
సీఏ ఫలితాలు విడుదల

సీఏ(ఛార్టర్డ్ అకౌంటెన్సీ)-2025 ఫలితాలు విడుదలయ్యాయి. సీఏ ఫౌండేషన్, ఇంటర్మీడియెట్, ఫైనల్ రిజల్ట్స్ ICAI వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమ రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. సెప్టెంబర్ నెలలో ఈ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.
వెబ్‌సైట్: <
News November 3, 2025
అచ్చంపేట: రేషన్ గోదాంలో 257 క్వింటాళ్ల దొడ్డు బియ్యం

2024 ఏప్రిల్ నుంచి రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. నిల్వ ఉన్న దొడ్డు బియ్యం గురించి సివిల్ సప్లై అధికారులు నిర్లక్ష్యం చేశారు. దీంతో అచ్చంపేట పట్టణంలోని సివిల్ సప్లై గోదాంలో 257 క్వింటాళ్ల దొడ్డు రేషన్ బియ్యం ఏడాది కాలంగా తుట్టెలు కట్టి, పురుగులు పట్టీ ముక్కి పోతున్నాయి. అదే గోదాంలలో నిల్వ ఉన్న సన్న బియ్యనికి కూడ పురుగులు పడుతున్నాయి.


