News August 1, 2024
సీఎంని కలిసిన పటాన్‌చెరు ఎమ్మెల్యే

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పటాన్‌చెరు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో జరిగిన భేటీలో పాల్గొన్నారు. వారితో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ ఉన్నారు.
Similar News
News April 5, 2026
జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం: హరీశ్ రావు

భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడిగా బాబు జగ్జీవన్ రామ్ గుర్తుండిపోతారన్నారు. పీడిత వర్గాల అభ్యున్నతి, కార్మికుల హక్కుల పరిరక్షణలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన ఆశయ సాధనలో మనమందరం భాగస్వాములమవుదామని పిలుపునిచ్చారు.
News April 5, 2026
మెదక్: 3 నెలల రేషన్.. 30 వరకు పంపిణీ

మెదక్ జిల్లాలో 520 రేషన్ దుకాణాల ద్వారా ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల సన్న బియ్యం సరఫరా జరుగుతోందని జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద్ తెలిపారు. లబ్ధిదారులు తొందరపడకుండా ఈ నెల 30 వరకు సమీప రేషన్ దుకాణాల్లో సరుకులు పొందాలని సూచించారు. సరుకుల కొరత లేదని, పారదర్శకంగా పంపిణీ జరుగుతుందని చెప్పారు. వదంతులు నమ్మకుండా అవసరమైతే అధికారులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
News April 4, 2026
మెదక్: ‘ఓటర్ల మ్యాపింగ్ త్వరితగతిన చేయాలి’

ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం దృష్ట్యా మ్యాపింగ్ ప్రక్రియ పురోగతి సాధించేలా ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ప్రతిమా సింగ్ పాల్గొన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో ఓటర్ల మ్యాపింగ్, బూత్ స్థాయి అధికారుల శిక్షణ, బూత్ స్థాయి అధికారులు మ్యాపింగ్ త్వరితగతిన చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.


