News August 24, 2025
సీఎం అన్న ఇంటిని కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా?: KTR

నాయకులు మోసం చేసినా కార్యకర్తలు గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకున్నారని కేటీఆర్ అన్నారు. శేరిలింగంపల్లిలో ఆయన మాట్లాడుతూ.. హైడ్రా అరాచకాలతోనే HYDలో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలిందన్నారు. తెలంగాణకు గుండెకాయగా కేసీఆర్ HYDను మార్చారని, దుర్గంచెరువు FTLలో సీఎం అన్న తిరుపతిరెడ్డి అక్రమంగా కట్టిన ఇంటిని కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా అని ప్రశ్నించారు.
Similar News
News August 24, 2025
GATE-2026 షెడ్యూల్‌లో మార్పు

M.Tech, PhD కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(GATE-2026) షెడ్యూల్ మారింది. రేపటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ స్టార్ట్ కావాల్సి ఉండగా పోస్ట్‌పోన్ అయింది. ఈనెల 28నుంచి అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు అధికారిక <
News August 24, 2025
SKLM: రేపు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్ సైట్‌ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్‌కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.
News August 24, 2025
కొరిశపాడులో దొంగతనం.. రూ.1.85కోట్ల ల్యాప్‌ట్యాప్‌ల చోరీ

బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల వద్ద భారీ చోరీ జరిగిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. స్థానికుల వివరాల మేరకు.. ఓ కంటైనర్ హైదరాబాదు నుంచి చెన్నై వెళ్తోంది. ఈ క్రమంలో కంటైనర్ నుంచి సుమారు 250 ల్యాప్‌టాప్‌లను గుర్తు తెలియని దుండగులు శనివారం అపహరించారు. వీటి విలువ సుమారు రూ.1.85 కోట్లు ఉంటుందని చీరాల డీఎస్పీ మొయిన్ వివరాలు వెల్లడించారు.