News January 2, 2025
సీఎం కప్ పోటీల్లో ఖమ్మంకు ఐదు పతకాలు

హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీల్లో ఖమ్మం జిల్లాకు 5 పతకాలు సాధించినట్లు జిల్లా కోచ్, జాతీయ స్థాయి ప్రధాన న్యాయ నిర్ణేత తెలిపారు. సాయి భవ్యశ్రీ 24 కేజీల విభాగంలో, ప్రేమ్ కుమార్ 65 కేజీల విభాగంలో, జయవంత్ 56 కేజీల విభాగంలో, యువ తేజ్ చౌహాన్ 27 కేజీల విభాగంలో, జె ప్రహర్షన్ పాల్24 కేజీల విభాగంలో.. ఆయా క్రీడల్లో ప్రతిభ చూపి, బంగారు పతకాలు సాధించినట్లు వివరించారు.
Similar News
News March 2, 2026
ఖమ్మం: బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్

గర్భాశయ క్యాన్సర్ నివారణకు 14-15 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఖమ్మం జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. మార్చి 4న జీజీహెచ్‌లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. జిల్లాలో 14 వేల మంది బాలికలను గుర్తించి, 7 ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు వేయనున్నారు. మార్కెట్‌లో రూ.3,500 విలువ చేసే ఈ టీకాను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది.
News March 2, 2026
ఖమ్మం: రైతు భరోసా కోసం ఎదురుచూపులు

రైతు భరోసా పథకం అమలు కోసం ప్రభుత్వం నిధుల విడుదలకు పచ్చజెండా ఊపినట్లు ప్రకటనలు వచ్చినా, క్షేత్రస్థాయిలో జాప్యం జరుగుతోంది. ఏటా ఎకరానికి రూ.15 వేలు ఇస్తామన్న హామీ ప్రకటనలకే పరిమితమైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిధుల కొరతతో పెట్టుబడి సాయం అందక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వెంటనే నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.
News March 2, 2026
ఖమ్మం: నిర్లక్ష్యం వీడకుంటే ఉద్వాసనే

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ఉపాధ్యాయులపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత మూడు నెలల్లో 70 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేయగా, ఎనిమిది మందిని సస్పెండ్ చేశారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిని టర్మినేట్ చేశారు.(ECR) అమలు, ఎఫ్ఆర్ఎస్ హాజరుపై కలెక్టర్ అనుదీప్ ప్రత్యేక నిఘా పెట్టారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారైనా వదిలేది లేదని డీఈఓ చైతన్య జైనీ హెచ్చరించారు.


