News June 13, 2024
సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకి మంత్రి గుమ్మడి సంధ్యారాణి పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నివాసంలో మంత్రి సంధ్యారాణి మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. శాఖలు కేటాయించిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని సీఎం చంద్రబాబు మంత్రిని సూచించారు.
Similar News
News November 5, 2025
VZM: పీజీ పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు డిబార్

ఏయూ పీజీ పరీక్షలలో ముగ్గురు విద్యార్థులను డిబార్ చేశారు. మంగళవారం ప్రారంభమైన పీజీ పరీక్షల్లో విజయనగరం జిల్లా ఎస్.కోట చైతన్య డిగ్రీ కళాశాలలో కెమిస్ట్రీ మూడో సెమిస్టర్ పరీక్షలు రాసిన ముగ్గురు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కి పాల్పడుతున్నట్లు విశ్వవిద్యాలయంకి వెళ్లిన తనిఖీ బృందం గుర్తించింది. దీంతో ఈ విద్యార్థులను అధికారులు డిబార్ చేశారు. నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని ఏ.యూ స్పష్టం చేసింది.
News November 5, 2025
పెట్టుబడులపై అవగాహన కల్పించండి: మంత్రి కొండపల్లి

విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విధానాల అమలు, తదితర అంశాలపై అధికారులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. వివిధ దేశాల్లో కీలక స్థానాల్లో ఉన్న తెలుగు ఎన్నారైలతో ప్రత్యేక క్లబ్ ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పారిశ్రామిక విధానం వివరించి వారికి పెట్టుబడులపై అవగాహన కల్పించాలని అన్నారు.
News November 4, 2025
VZM: ఈ నెల 6న జడ్పీ సర్వ సభ్య సమావేశం

జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఈనెల 6న ఉదయం 11 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ భవనంలో జరుగనుందని CEO సత్యనారాయణ మంగళవారం తెలిపారు. అక్టోబర్ 29న నిర్వహించాల్సిన సమావేశాన్ని తుఫాన్ కారణంగా వాయిదా వేశామన్నారు. జిల్లా పరిషత్ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నవంబర్ 6న సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.


