News March 19, 2025

సీఎం చంద్రబాబుని కలసిన మాగుంట

image

ఢిల్లీ విచ్చేసిన సీఎం చంద్రబాబు నాయుడిని విమానాశ్రయంలో మంగళవారం ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఇటీవల ఎంపీ మాగుంట చెన్నైలో గుండెకు శాస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసి మాగుంట ఆరోగ్యం గురించి సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీలు పాల్గొన్నారు.

Similar News

News March 19, 2025

ఒంగోలు: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి

image

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన, గుణాత్మక విద్య అందడమే లక్ష్యంతో పనిచేస్తున్నదని కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ విద్యా శాఖాధికారులతో సమావేశమై G.O 117, డ్రాప్ అవుట్స్ తదితర అంశాలపై సమీక్షించి, పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జీవో 117ను ఉపసంహరించిన తర్వాత ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రక్రియను విద్యాశాఖ ప్రారంభించిందన్నారు.

News March 18, 2025

ప్రకాశం జిల్లాలో 90 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

image

ప్రకాశం జిల్లాలో 90 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ సోమవారం తెలిపారు. కందులకు 45 కొనుగోలు కేంద్రాలు, శనగలకు 36 కొనుగోలు కేంద్రాలు, మినుములకు 10 కొనుగోలు కేంద్రాలను మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయుటకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ క్రాప్‌లో కంది, శనగ, మినుములు నమోదైన రైతులు 2 రోజులలో సీఎం యాప్‌లో తమ పేర్లను రైతు సేవా కేంద్రాలలో నమోదు చేసుకోవాలన్నారు.

News March 18, 2025

22న పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లా పర్యటన?

image

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈనెల 22న ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు జనసేన పార్టీ నాయకులకు సమాచారం అందినట్లుగా విశ్వసనీయ సమాచారం. ప్రధానంగా కనిగిరి లేదా దర్శి నియోజకవర్గాలలో ఉపాధి హామీ పనుల పరిశీలన కోసం డిప్యూటీ సీఎం రావడం జరుగుతుందని జనసేన వర్గాల్లో చర్చ నడుస్తుంది. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

error: Content is protected !!