News December 29, 2025

సీఎం చంద్రబాబును కలిసిన గుడిసె క్రిష్ణమ్మ

image

కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ సోమవారం CM చంద్రబాబు నాయుడును కలిశారు. జిల్లాలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై సీఎంతో చర్చించారు. కార్యకర్తలతో సమన్వయంగా ఉంటూ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా చంద్రబాబు ఆమెకు సూచించారు. పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని క్రిష్ణమ్మ తెలిపారు. జిల్లా రాజకీయ పరిణామాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.

Similar News

News January 4, 2026

రోడ్డు భద్రత మాసోత్సవాలు.. జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు

image

రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా వికారాబాద్ ఎస్పీ స్నేహ మెహ్ర ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్‌లలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాఠశాలలు, ప్రధాన కూడళ్లలో ప్రజలకు రోడ్డు భద్రత, గోల్డెన్ అవర్ ప్రాధాన్యతపై సూచనలు ఇస్తూ ప్రమాదం జరిగితే వెంటనే 100కు ఫోన్ చేయాలని తెలిపారు.

News January 4, 2026

పసి ప్రాణం తీసిన దుప్పటి.. తల్లి ప్రేమకు మిగిలింది కన్నీళ్లే!

image

వారణాసి (UP)లో గుండెల్ని పిండేసే విషాదం జరిగింది. రాహుల్ కుమార్, సుధా దేవి దంపతులకు 25 రోజుల క్రితం పుట్టిన పసికందు చలి తీవ్రతకు బలైంది. గడ్డకట్టే చలి నుంచి కాపాడాలని తనతో పాటు బిడ్డకూ మందమైన దుప్పటి కప్పి పడుకున్నారు. దీంతో ఊపిరాడక ఆ చిన్నారి తెల్లారేసరికి ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేస్తోంది. పెళ్లైన 2ఏళ్లకు పుట్టిన తొలి బిడ్డ కళ్లముందే విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

News January 4, 2026

జమ్మలమడుగుకు చేరుకుంటున్న వాలీబాల్ క్రీడాకారులు

image

రేపు జరగబోయే 69వ జాతీయస్థాయి అండర్-14 వాలీబాల్ క్రీడలకు 27 టీమ్స్‌ ఈరోజు జమ్మలమడుగుకు చేరుకున్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది. మిగతా టీంలు రేపు ఉదయానికి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటాయని తెలిపారు. ఈ క్రీడాకారులకు అందరికీ పూర్తిగా వసతి, భోజన ఏర్పాట్లు చేశామన్నారు. రేపు జరగబోయే పోటీలకు జమ్మలమడుగు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.