News April 5, 2025

సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 46వ అథారిటీ సమావేశం

image

ఎన్టీఆర్: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 46వ అథారిటీ సమావేశం శనివారం జరిగింది. ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి నారాయణ, CS కె. విజయానంద్, CRDA కమిషనర్ కె.కన్నబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. రాజధాని పనులలో పురోగతి, అమరావతి పునః నిర్మాణ పనులకు ప్రధాని మోదీ హాజరు కానున్నందున కార్యక్రమ సన్నాహకాల గురించి చంద్రబాబు ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. 

Similar News

News November 6, 2025

జగిత్యాల: ‘సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి’

image

జగిత్యాల జిల్లాలో సైబర్ నేరాలను నివారించేందుకు పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఉదయం వాకింగ్‌కు వచ్చే ప్రజలను పోలీసులు కలిసి సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆన్‌లైన్ బ్యాంకింగ్, షాపింగ్, సోషల్ మీడియా ఉపయోగంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద లింకులు ఓపెన్ చేయొదని, బ్యాంక్ వివరాలు, OTPలు ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. అనుమానం వస్తే 1930కి కాల్ చేయాలన్నారు.

News November 6, 2025

నకిలీ మద్యం కేసు.. విచారణలు 11కు వాయిదా

image

* AP నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్, రాము బెయిల్ పిటిషన్లపై విచారణ ఈ నెల 11కు వాయిదా వేసిన విజయవాడ కోర్టు. వారిని 10 రోజులు కస్టడీకి ఇవ్వాలన్న ఎక్సైజ్ అధికారుల పిటిషన్లపై విచారణా అదే రోజుకు వాయిదా
* ఇదే కేసులో జనార్దన్ రావు, జగన్మోహన్ రావును 5 రోజుల కస్టడీకి కోరిన అధికారులు.. విచారణ 11వ తేదీకి వాయిదా
* ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో IPS సంజయ్ బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా

News November 6, 2025

కుకునూరుపల్లి: ‘భోజనం రుచికరంగా ఉండాలి’

image

కుకునూరుపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన ప్రక్రియను కలెక్టర్ కె హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వంట గదిలో ఆహార పదార్థాలను పరిశీలించారు. మెనూ ప్రకారమే ఆలుగడ్డ టమాటా పప్పు, బిర్యాని రైస్ వండినట్లుగా వంట సిబ్బంది తెలిపారు. ఆహార పదార్థాల నాణ్యత పరిశీలిస్తూ బిర్యాని, కూరల్లో నాణ్యత పెంచాలని, విద్యార్థులకు రుచికరంగా వండాలని వంట సిబ్బందిని ఆదేశించారు.