News March 18, 2025

సీఎం తిరుపతి పర్యటన ఏర్పాట్ల పరిశీలన

image

సీఎం చంద్రబాబు ఈనెల 20, 21వ తేదీల్లో తిరుపతి, తిరుమలలో పర్యటించనున్నారు. 20వ తేదీ తిరుపతి మీదుగా తిరుమల చేరుకుంటారు. 21వ తేదీ శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. రేణిగుంట విమానాశ్రయంలో అధికారులతో సమీక్షించారు. సీఎం పర్యటనలో తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలను అధికారులకు వివరించారు.

Similar News

News March 19, 2025

నిర్మల్‌: 204 మంది పరీక్ష రాయలే..!

image

నిర్మల్ జిల్లాలోని 23 పరీక్ష కేంద్రాల్లో మంగళవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 204 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు DIEO పరుశురాం ప్రకటనలో తెలిపారు. మొత్తం 6167కి 5963 మంది విద్యార్థులు పరీక్ష రాశారన్నారు. పరీక్షను ప్రశాంతంగా నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు.

News March 19, 2025

VKB: పదో తరగతి పరీక్షలు… కలెక్టర్ కీలక ఆదేశాలు

image

పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పరీక్షా కేంద్రంలోనికి సెల్ ఫోన్ అనుమతించకూడదన్నారు. తగు ఏర్పాట్లు చేయాలని అధికారులకు తెలిపారు.

News March 19, 2025

IPL: మిడిలార్డర్‌లో KL బ్యాటింగ్?

image

ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న KL రాహుల్ బ్యాటింగ్ పొజిషన్‌పై చర్చ జరుగుతోంది. టీ20ల్లో ఓపెనర్‌గా ఆడే అతను ఈసారి టీమ్ కోసం మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయినట్లు వార్తలొస్తున్నాయి. మెక్‌గుర్క్, డూప్లెసిస్ ఓపెనర్లుగా, అభిషేక్ పోరెల్ మూడో స్థానంలో, KL, అక్షర్, స్టబ్స్ మిడిలార్డర్‌లో ఆడతారని సమాచారం. DC తన తొలి మ్యాచును ఈనెల 24న వైజాగ్ వేదికగా LSGతో ఆడనుంది.

error: Content is protected !!