News February 28, 2025

సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు: జిల్లా ఎస్పీ

image

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. జిల్లాలో సీఎం పర్యటన సందర్బంగా ట్రయిల్ రన్ నిర్వహించారు. మార్చి నెల 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా బందోబస్తు విధులలో పాల్గొనే పోలీసు అధికారులు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.

Similar News

News February 28, 2025

గుడిపల్లి : మామిడి తోటలో ఏమేం దొరికాయి అంటే..?

image

ఇంటర్ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ మామిడి తోటలో దొరకడం కలకలం రేపుతోంది. ఇంటర్ పరీక్షలకు సంబంధించి పోలీస్ స్టేషన్ నుంచి ప్రశ్నాపత్రం తీసుకునే రిజిస్టర్లతో పాటు క్వశ్చన్ పేపర్లను భద్రపరిచిన లాకర్ కీ, ఎగ్జామినేషన్ సూపరింటెండెంట్, కస్టోడియల్ అధికారి వద్ద ఉండాల్సిన రెండు రిజిస్టర్లు, ప్రశ్నాపత్రం కోడ్ రిసీవింగ్‌కు సంబంధించిన అధికారిక ఫోన్, ఎగ్జామ్‌కు సంబంధించిన పలు పేపర్లు పడి ఉన్నట్లు తెలుస్తోంది.

News February 28, 2025

రోడ్డు ప్రమాదంలో చిత్తూరు వాసి దుర్మరణం

image

గూడూరు ఆదిశంకర College వద్ద నిన్న యాక్సిడెంట్ జరిగింది. ఆగి ఉన్న లారీని TATA AC ఢీకొనడంతో చిత్తూరుకు చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గూడూరులోని గవర్నమెంట్ హాస్పిటల్‌కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 28, 2025

చిత్తూరు- పుత్తూరు హైవేపై ప్రమాదం.. MLA బాబాయ్ దుర్మరణం

image

కార్వేటినగరం మండలం అల్లాగుంట గ్రామానికి చెందిన చొక్కలింగం(70) నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెదురుకుప్పం మండలం చవటగుంటకు చెందిన గోవర్ధన్ బైకుపై కార్వేటినగరం నుంచి పళ్లిపట్టుకు వెళుతూ చొక్కలింగంను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో చొక్కలింగం అక్కడికక్కడే మృతి చెందగా.. గోవర్ధన్‌కి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తి జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ చిన్నాన్నగా స్థానికులు గుర్తించారు.

error: Content is protected !!