News October 25, 2024
సీఎం పర్యటనకు పటిష్ట పోలీసు బందోబస్తు

మద్దూరు మండలంలో శనివారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్న నేపథ్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ యోగేష్ గౌతం తెలిపారు. శుక్రవారం హెలిప్యాడ్, సీఎం కాన్వాయ్ వెళ్ళే రోడ్డును పరిశీలించారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా కూడళ్లలో పోలీసులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. హెలిప్యాడ్ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సతీష్ ఇంటివరకు పోలీస్ బందోబస్తు ఉంటుందన్నారు.
Similar News
News May 8, 2025
తప్పుడు పోస్టులు పెట్టకూడదు: ఎస్పీ

దేశంలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా సామాజిక మాధ్యమాలలో ఎవరూ తప్పుడు పోస్టులు పెట్టకూడదని మహబూబ్ నగర్ ఎస్పీ జానకి సూచించారు. దేశ సరిహద్దులలో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో ముందస్తు భద్రత చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు 24 గంటలు విధుల్లో ఉంటారన్నారు. పోలీసులకు ప్రస్తుతం సెలవులను రద్దు చేసినట్టు వెల్లడించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు చేయకూడదన్నారు.
News May 7, 2025
MBNR: నీట్ పరీక్షకు పగడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

మే 4న జిల్లా వ్యాప్తంగా నిర్వహించే నీట్ పరీక్షకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశపుహాల్‌లో నీట్ పరీక్ష నిర్వాహకులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 13 కేంద్రాల్లో నీట్ పరీక్షను నిర్వహిస్తున్నామన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దివ్యాంగులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు ఉంటుందన్నారు.
News May 7, 2025
MBNR: సైబర్ క్రైమ్ బాధితులు గోల్డెన్ అవర్‌లో ఫిర్యాదు చేయాలి

సైబర్ క్రైమ్ బాధితులు గోల్డెన్అవర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేయాలని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ జానకి ధరావత్ శనివారం ఒక ప్రకటన ద్వారా సూచించారు. సైబర్ క్రైమ్ అరికట్టేందుకు అప్రమత్తతే ప్రధాన అస్త్రం అని వెల్లడించారు. ఆన్లైన్ మనీ గేమింగ్ బెట్టింగ్ చట్ట విరుద్ధం అని వెల్లడించారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ బెట్టింగ్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్, సోషల్ మీడియా ఫ్రాడ్ లాంటి పద్ధతులను నేరగాళ్లు ఉపయోగిస్తున్నారన్నారు.