News January 12, 2026
సీఎం పర్యటనపై నిర్మల్ కలెక్టర్ దిశానిర్దేశం

ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయించాలన్నారు.
Similar News
News February 5, 2026
పాకిస్థాన్‌లో టాప్-1లో నిలిచిన ‘ధురంధర్’

రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ OTTలోనూ రికార్డులు సృష్టిస్తోంది. ఈ మూవీ గత నెల 30న Netflixలో విడుదలై కేవలం 3 రోజుల్లోనే 7.6M వ్యూస్ సాధించింది. ‘యానిమల్’ (6.2M), ‘ఫైటర్’ (5.9M), ‘పుష్ప-2’ (5.8M) రికార్డులను బద్దలు కొట్టింది. థియేటర్లలో దాదాపు రూ.1300 కోట్ల వసూళ్లు సాధించిన ఈ సినిమా ఇప్పుడు OTTలోనూ దూసుకుపోతోంది. 7 దేశాల్లో టాప్-10లో నిలిచిన ‘ధురంధర్’ పాకిస్థాన్‌లో నంబర్-1లో నిలవడం విశేషం.
News February 5, 2026
విజయవాడ GGHలో వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి!

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అనస్థీషియా ఫైనల్ ఇయర్ చదువుతున్న దీపిక అనే వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బుధవారం సాయంత్రం విధుల్లో ఉన్న ఆమె, ఆహారం తెచ్చుకుంటానని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. గురువారం ఉదయం ఆమె మృతదేహం లభ్యమైంది. ACP దామోదర్ నేతృత్వంలో పోలీసులు కేసు నమోదు చేసి, ఆసుపత్రి పరిసరాల్లోని CC కెమెరా దృశ్యాలను విశ్లేషిస్తున్నారు.
News February 5, 2026
NLG: నిజాంకు ఎదురొడ్డి జైలు జీవితం.. వట్టికోట ఎందరికో స్ఫూర్తి

తెలంగాణ సాహిత్య వైతాళికుడు వట్టికోట ఆళ్వారుస్వామి శాలిగౌరారం మండలం మాధవరంలో పుట్టారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన, పాదయాత్రల ద్వారా గ్రంథాలయ ఉద్యమాన్ని పల్లెపల్లెకూ తీసుకెళ్లారు. జైలు లోపల, ప్రజల మనిషి, కనువిప్పుతో పాటు ఇంకా ఎన్నో రచనలు చేశారు. నిజాంకు ఎదురొడ్డి జైలు జీవితం గడిపారు. నేటి విద్యార్థులకు పుస్తకాల రూపశిల్పిగా, అక్షర యోధుడిగా ఆయనే స్ఫూర్తిప్రదాత. కాగా నేడు ఆయన వర్ధంతి.


