News May 10, 2024
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన పల్నాడు ఎస్పీ

ఎలక్షన్ కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిలకలూరిపేట పర్యటనకు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లను, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ శుక్రవారం పరిశీలించారు. జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట పట్టణం నందు రేపు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు.
Similar News
News November 2, 2025
GNT: భక్తులకు ఊరట.. అనుమతి ఇచ్చే అవకాశం?

బాపట్ల సూర్యలంక బీచ్‌ను నవంబర్ 3, 4 తేదీలలో (సోమవారం, మంగళవారం) తాత్కాలికంగా మూసివేసినట్లు RDO తెలిపారు. మెుంథా తుఫాను ప్రభావం వలన సముద్ర స్నానం చేయు ప్రాంతంలో భారీ గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా ఉన్నందున బీచ్‌ని మూసివేసినట్లు తెలిపారు. తదుపరి భద్రతా పరిశీలన చేసి ప్రకటన ఇచ్చేవరకు మూసివేయడమైనదని ఆయన తెలిపారు. కాగా కార్తీక పౌర్ణమికి అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
News November 2, 2025
PGRSని సద్వినియోగం చేస్కోండి : కలెక్టర్

ప్రజాసమస్యల పరిష్కార వేదిక (PGRS)లో సమర్పించిన అర్జీల స్థితిని టోల్ ఫ్రీ 1100 ద్వారాతెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. Meekosam.ap.gov.in వెబ్సైట్ లోనూ నమోదు చేసుకోవచ్చని చెప్పారు. సోమవారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు మండల కార్యాలయాల్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
News November 1, 2025
ANU: బీఈడీ, ఎల్ఎల్ఎం రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో జరిగిన పలు యూజీ, పీజీ పరీక్షలకు సంబంధించి రీవాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు శనివారం తెలిపారు. తృతీయ సెమిస్టర్ బిఈడి, ఎల్.ఎల్.ఎమ్ పరీక్ష ఫలితాలను ప్రకటించామన్నారు. ఫలితాలను వర్సిటీ వెబ్సైట్ నుంచి పొందవచ్చని తెలిపారు.


