News August 18, 2025
సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

సీఎం చంద్రబాబు ఈనెల 19, 20 తేదీల్లో మంగళగిరిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ నాగలక్ష్మీ, SP సతీశ్ కుమార్ సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. 19వ తేదీన సీకే కన్వెన్షన్‌లో ‘జీరో పావర్టీ పీ4’ కార్యక్రమం. 20న మంగళగిరి మయూరి టెక్ పార్క్‌లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను ప్రారంభిస్తారు. కలెక్టర్, SP సభాస్థలం, సిట్టింగ్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు.
Similar News
News November 5, 2025
మేడికొండూరు: అదును చూసి.. భారీ చోరీ

మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో మంగళవారం దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన ఆమతి వీరయ్య దీక్షలో ఉండి ఇంటికి తాళం వేసి బయట ఉండగా, దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. వారు బీరువా పగలగొట్టి సుమారు రూ.10 లక్షల విలువైన 86 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.40 వేల నగదును దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 4, 2025
అమరావతి విజన్ రూపకల్పనలో భాగస్వామ్యం కావాలని CRDA పిలుపు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భవిష్యత్తు విజన్ రూపకల్పనలో మీరు కూడా భాగస్వాములవ్వాలని CRDA కోరుతుంది. అభిప్రాయాన్ని నమోదు చేసేందుకు ఈ లింక్‌ను క్లిక్ చేసి లేదా QR కోడ్‌ను స్కాన్ చేయాలని లింక్ https://tinyurl.com/4razy6ku రూపొందించింది. అమరావతి ప్రాంత అభివృద్ధికి విజన్ 2047 రూపొందించడంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చింది.
News November 4, 2025
GNT: మోటార్ వాహనాలకు దివ్యాంగుల నుంచి దరఖాస్తులు

దివ్యాంగులకు రెట్రో ఫిట్టేడ్ మోటరైజ్డ్ వాహనాలు మంజూరుకు ఆన్ లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు దివ్యాంగుల సంక్షేమ శాఖ డీ.డీ దుర్గాబాయి తెలిపారు. వంద శాతం సబ్సీడీతో ఈ వాహనాలు అందించడం జరుగుతుందని చెప్పారు. www.apdascac.ap.gov.inలో ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాలన్నారు. దివ్యాంగుల స్వతంత్ర చలనశీలత, ఆత్మ నిర్భరత, సామాజిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోందని తెలిపారు.


