News August 29, 2025
సీఎం పర్యటన మళ్లీ వాయిదా

సీఎం బెండాలపాడు పర్యటన వాయిదాలు పడుతుండటంతో గ్రామస్థులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఈ నెల 21న ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభించాల్సి ఉండగా వాయిదా పడింది. తిరిగి 30న ఉంటుందని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రకటించారు. హెలిప్యాడ్, బహిరంగ సభ ఎర్పాట్లు ముమ్మరం చేశారు. 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో పర్యటన వాయిదాపడింది. తిరిగి సెప్టెంబర్‌లో ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.
Similar News
News August 29, 2025
చిన్నంబావిలో అత్యధికంగా 33.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

వనపర్తి జిల్లాలో గత 24 గంటల్లో (నిన్న ఉదయం 8:30 నుంచి ఈరోజు ఉదయం 8:30 వరకు) చిన్నంబావిలో అత్యధికంగా 33.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. అమరచింతలో 0.4, మదనపూర్ 3.0, పెద్దమందడి 8.2, ఘనపూర్ 4.2, గోపాల్పేట 4.0, రేవల్లి 4.2, పానగల్ 4.0, వనపర్తి 2.2, కొత్తకోట 1.2, ఆత్మకూర్ 9.2, పెబ్బేర్ 4.2, శ్రీరంగాపూర్ 3.4, వీపనగండ్ల లలో 7.2 మి.మీ. వాన పడినట్లు సీపీఓ భూపాల్ రెడ్డి తన నివేదికలో పేర్కొన్నారు
News August 29, 2025
బంగాళాఖాతంలో మరో 2 అల్పపీడనాలు: IMD

ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న AP, TGకి IMD బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఉత్తర బంగాళాఖాతంలో SEP 3 నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా ప్రయాణించి బెంగాల్, ఒడిశా తీరాల మీదుగా SEP 5 నాటికి వాయుగుండంగా బలపడనుందని పేర్కొంది. అటు SEP రెండో వారంలో వాయవ్య బంగాళాఖాతంలో ఇంకో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో భారీ వర్షాలు కురవనున్నాయి.
News August 29, 2025
విరూపాక్షపురం మందుకోసం నైజీరియా నుంచి రాక

బైరెడ్డిపల్లి(M) విరూపాక్షపురం పక్షవాత ఆయుర్వేద వైద్యానికి ప్రత్యేకమని స్థానికులు పేర్కొన్నారు. తాజాగా ఇక్కడికి మందుకోసం నైజీరియా నుంచి నలుగురు వచ్చారు. వారు మాట్లాడుతూ.. తాము గత నెల 12న ఓ సారి మందు తీసుకున్నామని, రెండో విడత కోసం ఇవాళ వచ్చామన్నారు. మరోసారి మందు తీసుకోవాల్సి ఉందని, ఇప్పటికే ఆరోగ్యం మెరుగుపడిందన్నారు. ఇక్కడికి దేశం నలుమూలల నుంచి పెరాలిసిస్ రోగులు వస్తుంటారని స్థానికులు తెలిపారు.