News December 28, 2025
సీఎం, మాజీ సీఎంల భాషపై మెదక్ ఎంపీ కామెంట్స్

సీఎం, మాజీ సీఎంకు సబ్జెక్ట్ లేక బూతులు మాట్లాడుతున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. అసలు ఆ భాష ఏంటి.? మీ ఇద్దరి భాషతో రాజకీయ నాయకుల మీద ప్రజలకు గౌరవం పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ను ప్రజలు పట్టించుకోవడం లేదని, దేశంలో ఎన్నికలు జరిగితే ఒక్కొక్క రాష్ట్రాన్ని కాంగ్రెస్ కోల్పోతుందని తెలిపారు. మోదీ నాయకత్వంలో బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తెస్తామని స్పష్టం చేశారు.
Similar News
News December 31, 2025
పార్టీలో ఏది పడితే అది తినకండి!

తెలుగు రాష్ట్రాల్లో న్యూఇయర్ హడావుడి మొదలైంది. ఏం తాగాలి.. ఏం తినాలో లిస్ట్ రాసేసుకున్నారు. అయితే రాత్రి సమయంలో ఏది పడితే అది తింటే ఆరోగ్యం పాడవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘చిప్స్, పకోడీ, డీప్ ఫ్రై చేసిన చికెన్ వంటి వాటితో గ్యాస్, అసిడిటీ వస్తుంది. అందుకే నాన్‌వెజ్ కూడా మితంగా తినాలి. మటన్, చికెన్ వంటివి నైట్ డైజెస్ట్ అవ్వవు. స్వీట్స్, కేకులు కూడా లిమిట్‌గానే తినాలి’ అని సూచిస్తున్నారు.
News December 31, 2025
కర్నూలు: ‘ప్రైవేట్ వాహనాలకు VLTD తప్పనిసరి’

అన్ని ప్రైవేట్ సర్వీస్ వాహనాలకు 2026 జనవరి 1 నుంచి VLTD (వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైస్) తప్పనిసరి అని కర్నూలు రవాణా శాఖ ఉప కమిషనర్ శాంత కుమారి తెలిపారు. మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్, స్టేజీ క్యారేజ్, కాంట్రాక్ట్ క్యారేజ్‌తో పాటు అన్ని సరుకు వాహనాల యజమానులు సమీప RFC కేంద్రాల్లో VLTD బిగించి రవాణా శాఖలో నమోదు చేయాల్నారు. VLTD అమర్చని వాహనాలకు వాహన్ పోర్టల్‌లో అందుబాటులో ఉండవని అన్నారు.
News December 31, 2025
ట్రైనీ కానిస్టేబుళ్లు క్రమశిక్షణతో మెలగాలి: ఎస్పీ

క్రమశిక్షణ, చట్టాలపై అవగాహనతో పాటు సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లకు సూచించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చి కర్నూలు జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో ట్రైనింగ్ పొందుతున్న 205 ట్రైనీ కానిస్టేబుళ్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మారుతున్న నేరాలకు అనుగుణంగా టెక్నాలజీ, కమ్యూనికేషన్ స్కిల్స్‌లో నైపుణ్యం అవసరమి చెప్పారు.


