News December 11, 2024
సీఎం మీటింగ్‌కు వెళ్లనున్న కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు

కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు డీ.కే బాలాజీ, లక్ష్మిశ నేడు సీఎం మీటింగ్‌కు వెళ్లనున్నారు. నేడు, రేపు అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న కలెక్టర్ల సదస్సులో పాల్గొంటారు. కూటమి ప్రభుత్వం 6 నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. అలాగే స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలపై సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు.
Similar News
News February 19, 2026
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

వసతి గృహాల్లో అంటి వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు: కృష్ణా కలెక్టర్
* ఇన్‌స్టా పరిచయం.. ఝార్ఖండ్ నుంచి బందరుకు వివాహిత
* కృష్ణాలో బెల్ట్ షాపుల జోరు.. మామూళ్ల హోరు.!
* మచిలీపట్నం: బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి
* విజయవాడ గాంధీ హిల్స్‌లో యువత వెకిలి చేష్టలు.!
* కృష్ణా : పది పరీక్షలకు 297 కేంద్రాలు.. 61 సమస్యాత్మక కేంద్రాలు
News February 19, 2026
వసతి గృహాల్లో అంటు వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు: కలెక్టర్

సంక్షేమ వసతి గృహాల్లో అంటువ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన గురువారం కలెక్టరేట్‌లో అంతర్ శాఖల ఉమ్మడి తనిఖీ కమిటీ సమావేశం జరిగింది. అంటువ్యాధుల ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. వసతి గృహాలను నిరంతరం తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ డా. యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.
News February 19, 2026
మంగినపూడి బీచ్‌లో 24న సందడే సందడి..!

ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా స్థాయి సాప్ లీగ్ టోర్నమెంట్‌లో భాగంగా సైక్లింగ్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలు ఈనెల 24న మచిలీపట్నం మంగినపూడి బీచ్ వద్ద నిర్వహించనున్నారు. అండర్-18 బాలురకు 10 కి.మీ., బాలికలకు 5 కి.మీ. దూరంతో పోటీలు నిర్వహిస్తారు. పాల్గొనదలచిన క్రీడాకారులు www.sports.ap.gov.inలో ముందుగా నమోదు చేసుకోవాలని జిల్లా క్రీడా అధికారి తెలిపారు.


