News January 17, 2026

సీఎం రూట్ అని తెలిసినా వినలేదు.. కేసు నమోదు

image

సీఎం రూట్ ఉన్న విషయం తెలిసి కూడా జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్ యజమాని అక్రమ పార్కింగ్లు చేశాడంటూ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని ఫ్యాట్ పిజీయన్ పబ్ నిర్వాహకులు సీఎం రూట్ ఉందని చెప్పినా వినిపించుకోకుండా తమ కస్టమర్లతో వాహనాలను పార్కింగ్ చేయించడంతో సీఎం రూట్‌లో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పబ్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 13, 2026

HYD: రేపే TG EAPCET నోటిఫికేషన్..!

image

JNTU, తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహించనున్న TG EAPCET 2026 ప్రవేశ పరీక్షకు సంబంధించి శనివారం ఉదయం నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు పరీక్షల కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. 19వ తేదీ ఉదయం 11:30 గంటల నుంచి ఆన్‌లైన్‌లో విద్యార్థులు దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించారు. ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. SHARE IT.

News February 13, 2026

BREAKING: రంగారెడ్డిలో హోరాహోరి.. ఫలితాలు ఇవే!

image

రంగారెడ్డిలోని 6 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, BRS హోరాహోరీగా నిలిచాయి. మొత్తం 6 మున్సిపాలిటీల్లో 126 వార్డులు ఉండగా 54 కాంగ్రెస్, 46 బీఆర్ఎస్, 16 బీజేపీ, 9 మంది ఇండిపెండెంట్లు గెలుపొందారు. ఆమన్‌గల్‌ BRS, ఇబ్రహీంపట్నం BRS, షాద్‌నగర్ INC, శంకర్‌పల్లి INC, మొయినాబాద్ హంగ్, చేవెళ్లలో INC సత్తాచాటాయి. మొయినాబాద్‌లో మరో వార్డు ఫలితం రావాల్సి ఉంది. కానీ, ఇక్కడ ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌ను టచ్ చేయలేదు.

News February 13, 2026

FLASH: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ BRS కైవసం

image

HYD శివారులోని ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో ఆద్యంతం BRS జోరు కొనసాగింది. 24 వార్డుల్లో 13 BRS అభ్యర్థులు కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 8, BJP 2, స్వతంత్ర అభ్యర్థి ఒక వార్డులో విజయం సాధించారు. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో BRS పీఠం దక్కించుకుంది. దీంతో గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇతర మున్సిపాలిటీల ఫలితాల కోసం Way2News ఫాలో అవ్వండి.