News May 5, 2024
సీఎం రేవంత్ రెడ్డికి ఆ 4 స్థానాలు ఎంతో కీలకం !
సీఎం రేవంత్ రెడ్డికి ఆ నాలుగు ఎంపీ స్థానాలు ఎంతో కీలకంగా మారాయి. ఉమ్మడి జిల్లాలో MBNR, NGKL ఎంపీ స్థానాలతో పాటు సిట్టింగ్ స్థానం మల్కాజిగిరి, స్నేహితుడు పోటీ చేస్తున్న భువనగిరి స్థానాలు కీలకంగా మారాయి. వారిని గెలిపించుకునేందుకు రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా రేవంత్ రెడ్డి పలుమార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
Similar News
News January 16, 2025
UPDATE: కల్వకుర్తిలో రోడ్డు ప్రమాదం.. మృతుల వివరాలు
కల్వకుర్తి మండలంలోని తర్నికల్ గ్రామం వద్ద తిరుపతి హైవేపై బుధవారం సాయంత్రం <<15163728>>ఘోర రోడ్డు<<>> ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతుల వివరాలు.. కల్వకుర్తి మండలంలోని తోటపల్లి గ్రామానికి చెందిన బంగారయ్య (36), మహేశ్ (35) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
News January 16, 2025
వనపర్తి: పాముకాటుతో అత్తాకోడళ్ల మృతి
పాముకాటుతో అత్తాకోడళ్లు మృతిచెందారు. ఈ ఘటన వరపర్తి జిల్లా వీపనగండ్లలోని వల్లభాపురంలో జరిగింది. స్థానికుల ప్రకారం.. ఈనెల 6న అత్త కిష్టమ్మ(75)ను ఎడమ చేతిపై పాము కాటేయడంతో మరణించింది. కాగా, ఈనెల 12న కోడలు ఎల్లమ్మ(52) ఇంటి అరుగుపై పడుకొని ఉంది. ఈక్రమంలో నాగుపాము ఆమె కాలిపై కాటేసింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News January 16, 2025
MBNR: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు ఎన్నంటే?
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే అన్ని జిల్లాల్లో దాదాపుగా పూర్తయినట్లేనని అధికారులు అంటున్నారు. ప్రజాపాలనలో MBNR-2,09,514, NGKL-2,33,124, GWL-1,46,832, NRPT-1,48,780, WNP-1,42,075 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటికే గ్రామాల్లో కార్యదర్శి ఇంటింటికీ సర్వే చేసి వివరాలను యాప్‌లో నమోదు చేశారు. కొందరి వివరాలు నమోదు కాకపోవడంతో సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.