News February 14, 2025

సీఎం రేవంత్ రెడ్డి LOVE STORY మీకు తెలుసా..?

image

పడవలో ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడ్డారు మన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. ఇంటర్ చదివే రోజుల్లో నాగార్జునసాగర్‌ వెళ్లిన రేవంత్‌కు పడవలోనే గీతారెడ్డిని చూసి మనసు పారేసుకున్నారు. ఇంకేముంది.. పరిచయం కాస్త స్నేహంగా.. స్నేహం కాస్త ప్రేమగా మారింది. రేవంత్ రెడ్డి గీతారెడ్డి తరఫున వారి ఇంట్లో మాట్లాడి ప్రేమను గెలిపించుకున్నారు. రెండు కుటుంబాల అంగీకారంతో 1992లో ఒక్కటయ్యారు.

Similar News

News February 22, 2026

పొగపెట్టి ఎలుకలను నిర్మూలించడం

image

పొగపెట్టి ఎలుకలను నిర్మూలించే విధానాన్ని పంట ఏ దశలోనైనా అనుసరించవచ్చు. బర్రో ఫ్యూమిగేటర్‌ ద్వారా ఎలుకలు ఉండే కన్నాలలో పొగను వదిలి సులువుగా చంపవచ్చు. అయితే పొగను వదిలేటప్పుడు కన్నం చుట్టూ ఉన్న పగుళ్లను మట్టితో మూసివేయాలి. పొగను కనీసం మూడు నిమిషాలు వదలాలి. ఇలా చేస్తే ఒకే కన్నంలో వివిధ దశలలో ఉన్న ఎలుకలను నిర్మూలించవచ్చు. తదుపరి సీజన్‌లో వాటి ఉద్ధృతిని తగ్గించవచ్చు.

News February 22, 2026

గోవా సీఎంను కలిసిన బాపట్ల కలెక్టర్

image

గోవా పర్యాటక విధానం బాపట్లకు ఆదర్శమని కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ అన్నారు. మూడు రోజుల అధ్యయన పర్యటన ముగింపు సందర్భంగా బృందం గోవా సీఎం డాక్టర్ ప్రమోద్ సావంత్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. తీర ప్రాంత అభివృద్ధిలో పర్యావరణ నిబంధనలు పాటించాలనే సూచనలను ఆయన ఇచ్చారు. గోవాలో పొందిన అనుభవాలను బాపట్ల తీర ప్రాంత అభివృద్ధిలో అమలు చేస్తామని కలెక్టర్ బృందం పేర్కొంది.

News February 22, 2026

బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. కప్ మనదే

image

ఏసీసీ ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2026 ఫైనల్స్‌లో భారత-A జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లకు 134 పరుగుల చేసింది. 135 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్-A మహిళల జట్టు 88 పరుగులకే ఆలౌట్ అయింది. ప్రేమ రావత్ 3.. సోనియా, తనూజా తలో రెండు వికెట్లతో సత్తా చాటారు. 46 పరుగుల తేడాతో గెలిచిన భారత జట్టు ఛాంపియన్‌గా నిలిచింది.