News February 14, 2025
సీఎం రేవంత్ రెడ్డి LOVE STORY మీకు తెలుసా..?

పడవలో ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడ్డారు మన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. ఇంటర్ చదివే రోజుల్లో నాగార్జునసాగర్ వెళ్లిన రేవంత్ పడవలో గీతారెడ్డిని చూసి మనసు పారేసుకున్నారు. ఇంకేముంది.. పరిచయం కాస్త స్నేహంగా.. స్నేహం కాస్త ప్రేమగా మారింది. గీతారెడ్డి తరఫున వారి ఇంట్లో మాట్లాడి ప్రేమను గెలిపించుకున్నారు. రెండు కుటుంబాల అంగీకారంతో 1992లో ఒక్కటయ్యారు.
Similar News
News September 18, 2025
JGTL: మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల మాతా శిశు సంరక్షణ కేంద్రంలో స్వస్త్ నారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. మహిళల ఆరోగ్యం కోసం నేటి నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మహిళలు ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా చూయించుకోవాలన్నారు. MLA సంజయ్ కుమార్, DMHO ప్రమోద్ కుమార్, తదితరులున్నారు.
News September 18, 2025
MDCL: మహిళలు, పిల్లల కోసం రక్త పరీక్షలు..!

HYD, MDCL, RR పరిధిలో స్వస్త్ నారీ శక్తి అభియాన్ ప్రోగ్రాం ప్రారంభమైంది. ఈ ప్రోగ్రాంలో మహిళలకు, పిల్లలకు ENT, నేత్ర పరీక్షలు, రక్తపోటు, షుగర్, దంత పరీక్షలు చేస్తున్నారు. నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు, గర్భిణులకు పరీక్షలు, రక్తహీనత పరీక్షలు చేయనున్నారు. టెలీ మానస్ సేవలు, TB పరీక్షలు, సికిల్ సెల్ ఎనిమియా పరీక్షలు అక్టోబర్ 2 వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్వహిస్తున్నారు.
News September 18, 2025
ఫలితాలను పెంచడంపై దృష్టి సారించాలి: కలెక్టర్

కెజిబివి, ఇంటర్మీడియట్ కళాశాలలో ఫలితాలను పెంచడంపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆయా పాఠశాలలు, ఇంటర్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ను ఆదేశించారు. బుధవారం ఆమె కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కేజీబివిలు, ఇంటర్ కళాశాలల్లో ప్రవేశాలు, అప్లిఏషన్, ఫలితాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. గడిచిన 3 సంవత్సరాలలో ప్రవేశాలు తక్కువగా ఉన్నాయని అన్నారు.