News March 25, 2025
సీఎం సభ ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

హుజూర్ నగర్‌లో ఈనెల 30న జరిగే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎస్పీ నరసింహ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానిక అధికారులు సభా ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. సభకు తరలివచ్చే ప్రజలకు పార్కింగ్ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు ఉన్నారు.
Similar News
News February 23, 2026
తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరు మార్పు

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన జరుగుతున్న క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్(TVVP) పేరును మార్చారు. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా ఛేంజ్ చేస్తూ డెసిషన్ తీసుకున్నారు. దీంతో ఇక నుంచి TVVP ఉద్యోగులు ప్రభుత్వ పరిధిలోకి రానున్నారు. అలాగే హైదరాబాద్ మెట్రోను ఎల్&టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని క్యాబినెట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
News February 23, 2026
గద్వాల: గ్రీవెన్స్ డే.. 10 ఫిర్యాదుల స్వీకరణ

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాసరావు గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఇందులో మొత్తం 10 ఫిర్యాదులు అందాయి (భూవివాదాలు-3, గొడవలు-3, మోసం-1, ఇతరాలు-3). వీటిని చట్టప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ సంబంధిత అధికారులను ఆదేశించారు.
News February 23, 2026
ఎన్నికలకు ముందే BCలకు 34% రిజర్వేషన్లు: CBN

AP: గత GOVT స్థానిక ఎన్నికల్లో BCల రిజర్వేషన్లను 24%కి తగ్గించిందని CM CBN అసెంబ్లీలో విమర్శించారు. ‘వారికి 34% రిజర్వేషన్ కోసం కమిటీ వేశాం. ఎలక్షన్స్‌కు ముందే రిజర్వేషన్లను పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. ST వర్గీకరణ కోసం జీఓ3 తెస్తే కాపాడలేకపోయారు. దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా నిర్ణయం తీసుకుంటాం. పేదలందర్నీ ఆదుకొనేలా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులిస్తాం’ అని తెలిపారు.


