News September 9, 2024

సీఎం సహాయ నిధికి రూ.కోటి విరాళం: దామచర్ల

image

వరద బాధితుల సహాయార్థం విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబుకు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు కోటి రూపాయల విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో శిద్దా రాఘవరావు, ఆయన సోదరులు, గోరంట్ల రవికుమార్, సుధానగుంట నరసింహారావు, వెంకట రామయ్య మరియు నిడమానూరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 3, 2025

రేపు ప్రకాశం జిల్లాకు వర్ష సూచన

image

ప్రకాశం జిల్లాలో మంగళవారం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ సోమవారం ప్రకటించింది. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఆ సమయంలో చెట్లకింద నిలబడరాదని సంస్థ ఎండి ప్రఖర్ జైన్ సూచించారు. అలాగే రైతులు వ్యవసాయ మోటార్ల వద్ద జాగ్రత్త వహించాలన్నారు.

News November 3, 2025

సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రకాశం కలెక్టర్!

image

ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు సోమవారం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కలెక్టర్ మీకోసం కార్యక్రమానికి వచ్చే అర్జీదారుల అర్జీల పరిష్కారం అనంతరం సంబంధిత దరఖాస్తు దారుడుకి అధికారులు స్వయంగా ఫోన్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వారి నుంచి అభిప్రాయాలను స్వీకరించాలని, అలాగే అర్జీల పరిష్కార ప్రగతిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఈ విషయాన్ని అధికారులందరూ గుర్తించాలన్నారు.

News November 3, 2025

టంగుటూరు: తోపులాటలో అల్లుడి మృతి

image

టంగుటూరు శ్రీనివాసనగర్‌‌కు చెందిన దివ్యకీర్తితో వంశీకి ఆరేళ్ల కిందట వివాహమైంది. వంశీ హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్ జాబ్ కావడంతో అక్కడ కాపురం పెట్టారు. ఇటీవల భర్తతో గొడవపడి దివ్య తన ఇద్దరు బిడ్డలతో టంగుటూరులోని పుట్టింటికి వచ్చింది. వంశీ ఆదివారం భార్య ఇంటికి వచ్చి బంధువులతో రాజీకి ప్రయత్నించారు. ఈక్రమంలో తోపులాట జరిగి వంశీ కిందపడి స్పృహ కోల్పోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయాడని నిర్ధారించారు.