News September 22, 2025
సీఎం సారూ.. మేడారం ట్రాఫిక్ సమస్యపై దృష్టి పెట్టండి!

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లు పరిశీలించేందుకు CM రేవంత్ మంగళవారం మేడారం రానున్నారు. కాగా, ప్రతి జాతర సమయంలో భక్తులను ట్రాఫిక్ జామ్ ప్రధాన సమస్యగా వేధిస్తుంటుంది. తాడ్వాయి-మేడారం, పస్రా-మేడారం రోడ్డు వెడల్పు చేస్తే ట్రాఫిక్ సమస్య ఉండదని భక్తులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు. నిత్యం ఈ మార్గాల్లో గంటల తరబడి ట్రాఫిక్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై సీఎం స్పందించాలని కోరుతున్నారు.
Similar News
News September 22, 2025
మెదక్ ప్రజావాణికి 13 ఫిర్యాదులు

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ అర్జీదారుల నుంచి మొత్తం 13 దరఖాస్తులను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
News September 22, 2025
MBNR: పాలమూరు యూనివర్సిటీ ఫలితాలు విడుదల

మహబూబ్ నగర్ జిల్లాకేంద్రంలోని పాలమూరు విశ్వవిద్యాలయంలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ ఆరో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను వైస్ ఛాన్సలర్ ఆచార్య జిఎన్. శ్రీనివాస్ సోమవారం విడుదల చేశారు. వారు మాట్లాడుతూ.. ఫలితాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని తెలిపారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్, పరీక్షల నియంత్రణ అధికారిణి తదితరులు పాల్గొన్నారు.
News September 22, 2025
సిరిసిల్ల: 108 వాహనాలను తనిఖీ చేసిన ఆడిటింగ్ అధికారి

సిరిసిల్లలోని 108 వాహనాలను AMRA గ్రీన్ హెల్త్ సర్వీసెస్ రాష్ట్ర ఆడిటింగ్ అధికారి వెంకటేష్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాలలో వెంటిలేటర్, మానిటర్, ఇన్ఫ్యూజన్ పంప్, ఆక్సిజన్ సిలిండర్లు, గ్లూకోమీటర్, BP ఆపరేటర్, అత్యవసర పరిస్థితిలో ప్రథమ చికిత్సకు ఉపయోగించే పరికరాల పనితీరును పరిశీలించారు. క్షతగాత్రులకు 24 గంటలు సేవలందిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్రీనివాస్, స్వాతి, మదన్, రాజు ఉన్నారు.