News July 9, 2024

సీఎం హోదాలో తొలిసారి విశాఖకు చంద్రబాబు

image

ఎన్నికల తర్వాత CM హోదాలో చంద్రబాబు తొలిసారి విశాఖ రానున్నారు. ఈనెల 11న విశాఖలో ఆయన పర్యటించనున్నట్లు TDP శ్రేణులు తెలిపాయి. మెడ్‌టెక్, ఫార్మా, ఎస్ఈజెడ్‌ను సందర్శించనున్నట్లు సమాచారం. కాగా.. 2019 ఆగస్టు 9న, అనంతరం అక్టోబర్ 12న సంభవించిన హుద్‌హు‌ద్ తుపాన్ సమయంలో చంద్రబాబు ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించారు. ఆ తర్వాత ఒకటి రెండుసార్లు పర్యటించారు. 2019 నుంచి 2024 వరకూ ప్రతిపక్ష హోదాలో ఉన్నారు.

Similar News

News March 3, 2026

విశాఖలో మందగించిన రిజిస్ట్రేషన్లు

image

ఫిబ్రవరి 1 నుంచి భూముల విలువలు పెరుగుతాయని ప్రచారం జరిగినా ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేయడంతో విశాఖలో రిజిస్ట్రేషన్లు మందగించాయి. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో క్షీణత కనిపించింది. 9 సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఫిబ్రవరిలో సుమారు రూ.98 కోట్ల ఆదాయం లభించింది. అర్బన్‌లో అపార్ట్మెంట్లు అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. 2025-26కి రూ.1400 కోట్ల లక్ష్యంలో ఫిబ్రవరి నాటికి రూ.952 కోట్లు వసూలయ్యాయి.

News March 3, 2026

రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం: ఎమ్మెల్యే పంచకర్ల

image

పెందుర్తి నియోజకవర్గంలోని 10 వార్డుల్లో ఎనిమిది నెలల్లో రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు తెలిపారు. మంగళవారం 77వ వార్డులో మేయర్ పీలా శ్రీనివాసరావుతో కలిసి రూ.7.5 కోట్ల విలువైన సిసి రోడ్లు, కాలువ పనులకు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, విలీన గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని ఆయన పేర్కొన్నారు.

News March 3, 2026

విశాఖ: బీచ్‌లో యువకుడి అనుమానాస్పద మృతి

image

ఆర్కే‌బీచ్‌లోని సుప్రీం హోటల్ ఎదురుగా అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. స్థానికులు గమనించి త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడు జగదాంబ సమీపంలో నివాసం ఉండే ఎం.శ్రీధర్ (36)గా పోలీసులు గుర్తించారు. శ్రీధర్ కార్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి బీచ్‌లో రాళ్ల మధ్య విగతజీవిగా పడి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.