News June 21, 2024
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి: కలెక్టర్

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల సూచించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సౌరబ్ కుమార్ ప్రసాద్ అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ అమలాపురంలోని కలెక్టరేట్ నుంచి హాజరయ్యారు. జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చేపడుతున్న చర్యలు గురించి ఆయనకు కలెక్టర్ వివరించారు.
Similar News
News November 9, 2025
సబ్సిడీ వాహనాలకు దరఖాస్తుల ఆహ్వానం: ఈడీ

తూ.గో జిల్లాలోని సఫాయి కర్మచారి నిరుద్యోగ యువతకు NSKFDC పథకంలో భాగంగా సబ్సిడీపై సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలు మంజూరు చేస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జె.సత్యవతి తెలిపారు. అర్హులైన వారు కాకినాడలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. మరిన్ని వివరాలకు 62818-17023 నంబరును సంప్రదించాలని ఆమె సూచించారు.
News November 9, 2025
తుఫాన్ నష్టం అంచనాకు 10న కేంద్ర బృందం

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు ఈనెల 10, 11 తేదీల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమిబసు నేతృత్వంలోని 8 మంది సభ్యుల బృందం, నష్టం, పునరావాస చర్యలపై కేంద్రానికి నివేదిక ఇస్తుందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు.
News November 8, 2025
తాళ్లపూడి: యాసిడ్ పడి ఇద్దరికి గాయాలు

తాళ్లపూడి మండలం పైడిమెట్టలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. గోతులమయమైన రహదారిపై వెళ్తున్న యాసిడ్ ట్యాంకర్ నుంచి కుదుపులకు యాసిడ్ లీకైంది. అది ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరిపై పడటంతో వారికి గాయాలయ్యాయి. స్థానికులు బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.


