News November 30, 2024
సీజనల్ వ్యాధుల నిర్మూలనపై మంత్రి సమీక్ష

రాష్ట్రంలో ప్రబలే సీజనల్ వ్యాధుల నియంత్రణపై వైద్యా,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రజారోగ్య శాఖ ఆధ్వర్యంలోనీ ప్రాథమిక ఆసుపత్రిలో అందిస్తున్న సేవల బలోపేతంపై మంత్రి చర్చించారు. సీజనల్ వ్యాధులు విస్తరించకుండా ప్రాథమిక ఆసుపత్రులలో అవసరమైన సిబ్బంది, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News March 5, 2026
హవేలీఘనాపూర్: విద్యుదాఘాతంతో రైతు మృతి

హవేలీఘనాపూర్ మండలం బి. తిమ్మాయిపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామ శివారులోని ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై రైతు ఎర్ర బిక్షపతి(42) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య నాగమణి, ఒక కుమారుడు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైతు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
News March 5, 2026
‘పీఎం సూర్య ఘర్’తో విద్యుత్ బిల్లులు తగ్గించుకోవాలి: కలెక్టర్

ప్రజలు తమ గృహాలపై సౌర విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకుని విద్యుత్ బిల్లులు తగ్గించుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. గురువారం మెదక్ కలెక్టరేట్‌లో ‘పీఎం సూర్య ఘర్’ అవగాహన వాహనాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనం జిల్లాలోని గ్రామాలు, మండలాల్లో పర్యటించి సౌర విద్యుత్ ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News March 5, 2026
మెదక్: తల్లిపై కత్తితో దాడి చేసిన కొడుకు

కొల్చారం మండలం సీతారాంపూర్ తండాలో దారుణ ఘటన జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో మాలావత్ నాని అనే యువకుడు తన తల్లి లక్ష్మిపై కత్తితో దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘర్షణలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం బాధితురాలిని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


