News March 4, 2025
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: DMHO

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని బాపట్ల DMHO డాక్టర్ విజయమ్మ వైద్య సిబ్బందికి సూచించారు. మంగళవారం అద్దంకి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను DMHO సందర్శించారు. వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లతో సమావేశం నిర్వహించి, సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సలహాలు ఇచ్చారు.
Similar News
News November 8, 2025
పల్నాడు: నందికొండ పేరు ఎలా వచ్చిందో తెలుసా.!

పురాణాలలో పల్నాడు ప్రాంతాల ప్రస్తావన ఉంది. దక్షయజ్ఞ ధ్వంసం అనంతరం సతీ వియోగంతో శివుడు విసిగిపోయాడు. దీంతో అంగలు-పంగాలు వేసుకుంటూ తన వాహనమైన నందిని ఇప్పటి నాగార్జునసాగర్ ప్రాంతంలో విడిచిపెట్టగా ఆ నంది నందికొండగా పేరు వచ్చింది. శిరమున ఉన్న చంద్రవంకను మాచర్ల ప్రాంత అడవులలో విడిచి పెట్టగా నేటి చంద్రవంక నదిగా మారింది. మెడలో నాగుపామును కనుముల ప్రాంతంలో విడిచి పెట్టగా అది నాగులేరుగా మారిందని ప్రతీతీ.
News November 8, 2025
GNT: 19ఏళ్లలో 500 చిత్రాల్లో నటించిన గొప్ప నటుడు

తెలుగు చిత్ర హాస్యనటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు AVSగా పేరు గాంచిన ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం గుంటూరు (D) తెనాలిలో జన్మించారు. ఆంధ్రజ్యోతిలో పాత్రికేయుడుగా కేరీర్ ప్రారంభించిన AVS, మిస్టర్ పెళ్లాం సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. 19ఏళ్లలో AVS 500 చిత్రాల్లో నటించాడు. అంకుల్ సినిమాతో ఆయన నిర్మాతగా కూడా మారారు. ఆయనకు తన కుమార్తె లివర్ దానం చేశారు. కాగా నేడు NOV 8 ఆయన వర్ధంతి.
News November 8, 2025
నేడు టీడీపీ కార్యాలయానికి సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శనివారం కేంద్ర కార్యాలయాన్ని సందర్శించనున్నారు. ఆయన పార్టీ కార్యకర్తల నుంచి, ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించనున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చర్చించనున్నారు. అలాగే, పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా జిల్లా అధ్యక్షుల ఎంపిక, రాష్ట్ర కమిటీ కూర్పు వంటి ముఖ్య అంశాలపై ఆయన పార్టీ నేతలతో చర్చలు జరపనున్నాయి.


