News March 1, 2025

సీతంపేటలో పర్యటించిన కలెక్టర్

image

సీతంపేటలో జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ శనివారం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి వన్ ధన్ వికాస్ కేంద్రాల ద్వారా జరుగుతున్న జీడీ ప్రాసెసింగ్, అగరబత్తుల తయారీ విధానాన్ని పరిశీలించి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ పట్టు పరిశ్రమ యూనిట్‌ను సందర్శించారు. సీతంపేట ఐటీడీఎ ప్రాజెక్టు అధికారి సి. యశ్వంత్ కుమార్ రెడ్డి, అధికారులు తదితరులు ఉన్నారు.

Similar News

News March 1, 2025

ప.గో. జిల్లా TODAY TOP HEADLINES

image

✷ తాడేపల్లిగూడెంలో పెన్షన్ పంపిణీ చేసిన కలెక్టర్ ✷ జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం ✷ మార్చి 15 నుంచి 10వ తరగతి పరీక్షలు ✷ ఢిల్లీలో వర్క్ షాపునకు ఎంపికైన మహదేవపట్నం సర్పంచ్ ✷ పోలీస్ ఇండోర్ పరీక్షల్లో టాపర్‌గా మార్టేరు అమ్మాయి ✷ తణుకు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ర్యాలీ ✷ తణుకులో 123 మంది పరీక్షలకు గైర్హాజరు

News March 1, 2025

MBNR: యూడీఐడీ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోండి.!

image

సదరం గుర్తింపు కార్డు కోసం యుడీఐడీ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (SERP) సీఈఓ దివ్య దేవరాజన్ తెలిపారు. సదరం క్యాంపులు, ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డులు, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై జిల్లా కలెక్టర్లు, డిఆర్డిఓ, డిడబ్ల్యుఓ, డిసిహెచ్ఎస్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్లతో సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

News March 1, 2025

గర్భిణులు, వృద్ధులు, పిల్లలు బయటకు రావొద్దు: APSDMA

image

APలో 3 నెలలపాటు ఎండలు, వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని <>APSDMA<<>> వెల్లడించింది. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయంది. గర్భిణులు, బాలింతలు, పిల్లలు, వృద్ధులు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, బయటికెళ్తే జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. డీహైడ్రేట్ కాకుండా నీళ్లు, మజ్జిగ, కొబ్బరి, లెమన్ వాటర్ తాగాలని సూచించింది. ఎండలపై సమాచారం కోసం 112, 1070, 18004250101 నంబర్లను సంప్రదించాలంది.

error: Content is protected !!