News March 7, 2025

సీతంపేట కంపెనీకి జాతీయ స్థాయి అవార్డు

image

సీతంపేట మండలంలోని మన్యం సహజ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ జాతీయ స్థాయి భారత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఫర్ కలెక్టివ్ ఎంటర్ప్రైజెస్ అవార్డుకు ఎంపికైనట్లు డైరెక్టర్లు నూక సన్యాసిరావు, కర్రేక గౌరమ్మ గురువారం తెలిపారు. సీతంపేట ఈ అవార్డుకు ఎంపిక కావడం గర్వకారణమని వారు పేర్కొన్నారు. రైతులు మెరుగైన ఆదాయం పొందడంతో పాటు మహిళల్లో నైపుణ్యాల అభివృద్ధికి ఈ కంపెనీ ఉపయోగపడుతుందని సీఈఓ బి.శంకరరావు తెలిపారు.

Similar News

News March 9, 2025

స్టీల్ ప్లాంట్‌లో 900 మంది కార్మికులు తొలగింపు

image

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించింది. ఇప్పటికే అఖిలపక్ష కార్మిక సంఘాలు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సమ్మె నోటీసులు ఇచ్చారు. అయితే మరో పక్కన స్టీల్ సీఐటీయూ గౌరవాధ్యక్షుడు అయోధ్యరామ్‌కు యాజమాన్యం షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని అణగదొక్కేందుకు కార్మిక సంఘాల ప్రతినిధులపై ఉక్కు యాజమాన్యం కుట్రలు చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు.

News March 9, 2025

అయినవిల్లి: ఆకట్టుకున్న తల్లీకొడుకుల డ్రాయింగ్

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిన్న డ్రాయింగ్ టీచర్ వేసిన డ్రాయింగ్ పలువురిని ఆకట్టుకుంది. అయినవిల్లి మండలం కె.జగన్నాథపురంలో ఉన్న శ్రీఉమామహేశ్వర జిల్లా పరిషత్ హైస్కూల్‌లో డ్రాయింగ్ టీచర్‌గా పనిచేస్తున్న జి.సత్యనారాయణ మహిళా దినోత్సవం సందర్భంగా డ్రాయింగ్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయనను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, సహచర ఉపాధ్యాయులు అభినందించారు.

News March 9, 2025

తూ.గో: రోడ్డు ప్రమాదంలో విశ్రాంత ఏఆర్ ఎస్ఐ మృతి

image

ఆటో ఢీకొని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజమండ్రిలోని స్వరూప్ నగర్‌కు చెందిన విశ్రాంత ఏఆర్‌ SI త్రిమూర్తులు (65) శనివారం మృతిచెందాడు. బొమ్మూరు ఎస్ఐ ప్రియకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి ఆయన స్కూటీపై వెళుతుండగా శ్రీరామ్‌పురం ఫారెస్టు రోడ్డులో ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన త్రిమూర్తులు ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించాడు.

error: Content is protected !!