News December 12, 2025

సీతంపేట: గ్రీవెన్స్ ద్వారా 15 వినతులు స్వీకరించిన ఐటీడీఏ పీవో

image

సీతంపేట ఐటీడీఏలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 15 మంది గిరిజన ప్రజలు హాజరై తమ సమస్యలపై వినతులు సమర్పించారు. ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో ఎస్.వి.గణేష్, ఈఈ రమాదేవి, డిప్యూటీ డీఈవో రామ్మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 16, 2025

అనంత: మీ ముగ్గులు మా Way2Newsలో..!

image

ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల ముగ్గులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మా Way2Newsకి పంపండి. మీ పేరుతో మేము పబ్లిష్ చేస్తాం.
ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్‌పోర్టు సైజు ఫొటోను ఈ 97036 22022కు వాట్సాప్ చేయండి.

News December 16, 2025

నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు

image

కృష్ణా జిల్లా పాఠశాలల్లో విద్యార్థుల కోసం ఆధార్ ప్రత్యేక క్యాంపులు మంగళవారం నుంచి నిర్వహించనున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. నవంబర్‌లో నిర్వహించిన క్యాంపుల కొనసాగింపుగా ఈ నెల 16 నుంచి 20 వరకు, అలాగే 22 నుంచి 24 వరకు క్యాంపులు జరుగుతాయని పేర్కొంది. బయోమెట్రిక్ అప్‌డేట్ మిగిలి ఉన్న విద్యార్థులు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.

News December 16, 2025

కడెం: ఒకే కుటుంబం.. మూడు సార్లు విజయం

image

ఒక కుటుంబంలో సర్పంచ్‌గా ఒక్కసారి అవకాశం రావడమే కష్టంగా ఉంటే ఒకే కుటుంబానికి చెందిన వారు ముగ్గురు సర్పంచ్‌గా గెలిచారు. కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ గ్రామానికి చెందిన బొడ్డు రాజవ్వ 2013లో, 2019లో ఆమె కొడుకు గంగన్న సర్పంచ్‌గా గెలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన భార్య రాజేశ్వరి పోటీ చేసి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.