News March 28, 2025

సీతంపేట : మంచంపై నుంచి పడి విద్యార్థి మృతి

image

సీతంపేట మండలం దోనుబై ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న చలపతి శుక్రవారం మృతి చెందాడు. హాస్టల్‌లో తన బెడ్ నుంచి కిందికి దిగేప్పుడు కాలు జారిపడ్డాడు. ప్రమాదంలో చెవి భాగం వైపు గట్టిగా తగలటం వలన రక్తం రావటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తన తోటి స్నేహితులు చెప్తున్నారు. దోనుబై S.I ఘటనా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిది కారెంకాగుమానుగడుగా సమాచారం.

Similar News

News February 26, 2026

కామారెడ్డి: ఓడిన వారికి అప్పులే!

image

ఎన్నికల జాతర ముగిసింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు తమకున్న స్థలాలు తాకట్టు పెట్టారు. నమ్మబలికిన ఓటర్ల మాటలు నమ్మి లక్షల రూపాయలు గుమ్మరించారు. గెలుపుపై ధీమా కల్పించిన నేతలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. అభ్యర్థులను గాలికి వదిలేసి గెలిచిన వారి చెంతకు చేరుతున్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. డబ్బుతో ఓట్లను కొనే వ్యవస్థ ఉన్నంత కాలం ఇలాంటి విషాదాలు పునరావృతమవుతూనే ఉంటాయి.

News February 26, 2026

మహబూబ్ నగర్ అదనపు కలెక్టర్‌గా హరిప్రియ

image

ఉమ్మడిజిల్లాలో రెవెన్యూశాఖ అధికారులు బదిలీఅయ్యారు. మేడ్చల్ DROగా విధులు నిర్వహిస్తున్న JLB హరిప్రియను మహబూబ్ నగర్ జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్‌గా నియమితులయ్యారు. వెయిటింగ్‌లో ఉన్న అదనపుకలెక్టర్ పద్మజారాణి గద్వాల DROగా నియమితులయ్యారు. గద్వాల హౌసింగ్ PDగా పనిచేస్తున్న శ్రీనివాసరావు RDOగా నియామకం కాగా, RDOగా పనిచేస్తున్న అలివేలు హౌసింగ్ PDగా నియమితులయ్యారు.

News February 26, 2026

మార్చి 14న పిడుగురాళ్లలో జాతీయ లోక్ అదాలత్

image

మార్చి 14న పిడుగురాళ్లలోని సివిల్ కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు సివిల్ కోర్టు జడ్జి టి.ప్రవళిక బుధవారం తెలిపారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. పిడుగురాళ్ల కోర్టు పరిధిలోని కక్షిదారులు రాజీ పడవలసిన కేసులు, చెక్ బౌన్స్, ఎక్సైజ్ కేసులు, కుటుంబ తగాదాలు కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు.