News October 4, 2025
సీతానగరంలో రోడ్డు ప్రమాదం

సీతానగరం మండలం రఘుదేవపురం వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం తృటిలో తప్పింది. రాజమండ్రి నుంచి పురుషోత్తపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు పెట్రోల్ బంకు సమీపంలో యూటర్న్ తీసుకుంటున్న కారును ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. కారులో ఉన్న 25 మందిలో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ డి. రామ్ తెలిపారు.
Similar News
News October 5, 2025
రాజమండ్రి: తిరుపతి విమాన సర్వీస్‌కు విశేష స్పందన

రాజమండ్రి నుంచి తిరుపతికి కొత్తగా ప్రారంభించిన విమాన సర్వీస్‌కు విశేష స్పందన లభించింది. తాజాగా వచ్చిన తిరుపతి సర్వీస్‌లో రెండు రోజుల్లోనే 211 మంది ప్రయాణించారు. మొదటి రోజు రాజమండ్రి నుంచి 66, రెండో రోజు 67 మంది వెళ్లగా.. తిరుపతి నుంచి మొదటి రోజు 38, రెండో రోజు 40 మంది ప్రయాణించినట్లు అలయన్స్ ఎయిర్‌లైన్స్ మేనేజర్ నరసింహారావు తెలిపారు.
News October 4, 2025
రాజమండ్రి: 6న స్కూల్ గేమ్స్ సెలక్షన్స్: DEO

ఉమ్మడి తూ.గో జిల్లా స్కూల్ గేమ్స్ సెలక్షన్స్‌ను ఈ నెల 6వ తేదీన రాజమండ్రిలోని ఎస్.కె.వి.టి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నట్లు డీఈవో కె. వాసుదేవరావు తెలిపారు. ఫుట్‌బాల్ అండర్-14, కరాటే అండర్-14, 17 విభాగాల్లో ఈ పోటీలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు సంబంధిత పత్రాలతో హాజరు కావాలని, వివరాలకు పీఈటీలు ఎ.వి.డి. ప్రసాదరావు, వి. భువనేశ్వరిని సంప్రదించాలని డీఈవో కోరారు.
News October 4, 2025
తూ. గో: 11,915 మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లకు లబ్ధి

ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్న ఆటో, క్యాబ్ డ్రైవర్లకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. స్త్రీ శక్తి పథకం అనంతరం నష్ట పోతున్నామని భావించిన ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేలు చొప్పున అందజేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తూ.గో జిల్లాలో 11,915 మందికి రూ.17.87 కోట్లు మేర లబ్ధి చేకూరనుంది. నేడు అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో రూ.15 వేలు చొప్పున జమ కానుంది.