News April 7, 2025

సీతానగరం: ప్రియురాలు ఒప్పుకోకపోవడంతో మృతి

image

మనసుకు నచ్చిన మహిళ తనతో ఉండదని అనే విషయాన్ని జీర్ణించకోలేని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీతానగరం మండలం పురుషోత్తపట్నం పంచాయతీ పరిధిలోని వేమగిరి సునీల్ (26) స్థానిక ఓ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరుసకు మరదలు అయిన సదరు సదరు మహిళను కలిసి ఉందామని అడగాగ ఆంగీకరించకపోవడంతో మనస్థాపం చెంది మృతి చెందాడని ఎస్సై రామకుమార్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News April 7, 2025

రాజమండ్రి: 211 మంది ఉద్యోగులకు పదోన్నతులు

image

పంచాయతీలకు కార్యదర్శుల లేమి తీరనుంది. గ్రేడ్-5 స్థాయిలోని సచివాలయ ఉద్యోగులకు గ్రేడ్-4 కార్యదర్శులుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి తూ.గో జిల్లాలో 211 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించింది. వారిలో చాలామందిని ఏజెన్సీ గ్రామాలకు, మరి కొంతమందిని తూ.గో, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో పంచాయతీ సెక్రటరీలుగా నియమించారు. సోమవారం వీరంతా కొత్త స్థానాల్లో బాధ్యతలు చేపట్టనున్నారు.

News April 7, 2025

రాజమండ్రి: నేటి నుంచి వైద్య సేవలకు బ్రేక్

image

తూర్పు గోదావరి జిల్లాలోని సోమవారం నుంచి ఎన్టీఆర్ వైద్య (ఆరోగ్యశ్రీ) సేవలు నిలిపివేస్తున్నట్లు ఆరోగ్య శ్రీ అసోసియేషన్ ఆదివారం వెల్లడించింది. ప్రభుత్వం రూ.3,600 కోట్లు బకాయిలు చెల్లించకపోవడంతో అన్ని ఆసుపత్రుల్లో 3,257 వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. దీనిపై ఆసుపత్రి యాజమాన్యాలతో చర్చించేందుకు చర్యలు తీసుకుంటుందని రోగులకు ఇబ్బందులు లేకుండా ప్రత్నామయ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

News April 7, 2025

తూ.గో: నేడు యాథావిధిగ పీజీఆర్ఎస్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం నేడు(సోమవారం) కలెక్టరేట్ కార్యాలయంలో యథావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ పీ.ప్రశాంతి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖల అధికారులు కచ్చితంగా హాజరు కావాలని ఆదేశించారు. ఉదయం 10.గంటల నుంచి ఒంటి గంట వరకు జరుగుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

error: Content is protected !!