News April 9, 2025

సీతారాముల వారి కళ్యాణానికి పటిష్ట బందోబస్తు

image

ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 11న శుక్రవారం నిర్వహించనున్న సీతారాముల వారి కళ్యాణం సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. 2 వేలకు మంది పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. బందోబస్తు విధుల్లో నలుగురు అదనపు ఎస్పీలు, 25 మంది డీఎస్పీలు, 73 మంది సీఐలు, 177 మంది ఎస్ఐలు, 1700 మంది పోలీసు సిబ్బంది ఉంటారన్నారు.

Similar News

News July 5, 2025

కడప: పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్‌పై విచారణ

image

కడప పరిశ్రమల శాఖలో గతంలో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్‌గా పనిచేసిన కె.కృష్ణమూర్తిపై విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఆయనపై కొప్పర్తి పరిశ్రమల అధ్యక్షుడు జిల్లా కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదుపై కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఉషశ్రీని విచారణాధికారిగా, ఈశ్వరచంద్‌ను ప్రెజెంటింగ్ అధికారిగా నియమిస్తూ GO జారీ చేసింది.

News July 5, 2025

పోరుమామిళ్ల: హత్య కేసులో పదేళ్ల జైలు శిక్ష

image

ఆరేళ్ల క్రితం పోరుమామిళ్ల PS పరిధిలోని రామాయపల్లి గ్రామ సమీపంలో ఓ మతిస్థిమితం లేని యువతి హత్య కేసులో ముగ్గురు ముద్దాయిలు జిలాని బాషా, నాగేంద్ర ప్రసాద్, మహబూబ్ బాషాలకు పదేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ ఎ.డి.జే కోర్టు జడ్జి దీనబాబు శుక్రవారం తీర్పునిచ్చారు. యువతిని గొంతు నులిమి హత్య చేయగా అప్పటి నుంచి విచారణ చేసిన పోలీసులకు సరైన సాక్షాధారాలు దొరకడంతో ముద్దాయిలకు శిక్ష పడింది.

News July 4, 2025

కడప: ‘బాలల పరిరక్షణకు కృషి చేయాలి’

image

బాలల హక్కులను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బి.పద్మావతి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సభ్యురాలు బి.పద్మావతి అధ్యక్షతన బాలల హక్కుల పరిరక్షణ గురించి వివరించారు. వారి కోసం ఉద్దేశించిన చట్టాల అమలు తీరుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.