News December 3, 2025
సీతారామ ఎత్తిపోతలకు గరిష్ట భూ పరిహారం: కలెక్టర్

సీతారామ ఎత్తిపోతల పథకం భూసేకరణకు నిబంధనల మేరకు గరిష్ట పరిహారం అందిస్తామని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. బాజు మల్లాయిగూడెం, రేలకాయపల్లి రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఎకరాకు ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం పెంచిన మొత్తాన్ని వడ్డీతో కలిపి చెల్లించే చర్యలు చేపడతామన్నారు. పంటలు, చెట్లు, పంపుసెట్లు వంటి వాటికి కూడా ప్రత్యేక పరిహారం అందిస్తామని చెప్పారు.
Similar News
News December 3, 2025
ఖమ్మం సర్కారీ స్కూళ్ల అద్భుత ప్రదర్శన, కలెక్టర్ ప్రశంసలు

ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ విద్య ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల నైపుణ్యాలు తోడవ్వాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. స్వచ్ఛ హరిత విద్యాలయాల సర్వేలో అద్భుత ప్రతిభ కనబరిచి, అత్యధిక స్కోర్ సాధించిన 8 ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు కలెక్టర్ ప్రశంసపత్రాలు అందించి అభినందించారు. ఈ విజయం జిల్లాకు గర్వకారణం అని కలెక్టర్ తెలిపారు.
News December 3, 2025
ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి 29 మంది సీనియర్ రెసిడెంట్లు

ఖమ్మం జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ ఆసుపత్రికి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ శుభవార్త అందించింది. తాజాగా 29 మంది సీనియర్ రెసిడెంట్లను కేటాయించింది. పీజీ పూర్తి చేసిన ఈ నిపుణులైన వైద్యులు, సంవత్సరం పాటు అత్యవసర విభాగాలతో సహా జనరల్ ఆసుపత్రిలోని వివిధ విభాగాల్లో సేవలు అందిస్తారు. ఈ నియామకాలతో ఖమ్మం ప్రజలకు మరింత నాణ్యమైన వైద్యం అందుబాటులోకి రానుంది.
News December 3, 2025
ఖమ్మం: నేటి నుంచి మూడో విడత నామినేషన్ల పర్వం

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మూడో విడత నామినేషన్ల స్వీకరణ నేటి(బుధవారం) నుంచి ప్రారంభం కానుంది. జిల్లాలోని ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, సింగరేణి సహా మొత్తం 7 మండలాల్లో అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయవచ్చు. ఈ విడతలో మొత్తం 191 గ్రామ పంచాయతీలు, 1,742 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లను ఈ నెల 5 వరకు స్వీకరిస్తారని అధికారులు తెలిపారు.


