News April 6, 2025
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికైన జాన్ వెస్లీ

మధురైలో జరుగుతున్న సీపీఎం 24వ జాతీయ మహాసభల్లో అమరచింత వాసి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. నేడు చివరి రోజు జరిగిన జాతీయ మహాసభలో కేంద్ర నాయకత్వం జాన్ వెస్లీకి కేంద్ర కమిటీలో స్థానం కల్పించింది. జాన్ వెస్లీ కేంద్ర కమిటీకి ఎన్నికైన నేపథ్యంలో అమరచింత సీపీఎం నాయకులు గోపి, బుచ్చన్న, అజయ్, వెంకటేశ్, రమేష్, శ్యాంసుందర్ జాన్ వెస్లీకి అభినందనలు తెలిపారు.
Similar News
News April 7, 2025
జన్నారం: ఐటీఐ పాసైన విద్యార్థులకు ఉద్యోగాలు

రాష్ట్ర ప్రభుత్వ సంస్థ తెలంగాణ ఓవర్సీస్ మన్ పవర్ కంపెనీ, టామ్‌కామ్ సహకారంతో వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని జన్నారం ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ బండి రాములు సోమవారం మధ్యాహ్నం తెలిపారు. ఈ ఉద్యోగాల కోసం ఈనెల 8 జన్నారం ఐటీఐ కళాశాలలో 11 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. ఐటీఐ చేసిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News April 7, 2025
HCU విద్యార్థులపై కేసులు ఎత్తేయండి: భట్టి

TG: కంచ భూముల పరిరక్షణ కోసం నిరసనలు చేసిన HCU విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించాలని ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోలీసులను ఆదేశించారు. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఇద్దరు విద్యార్థులపై కేసులు ఉపసంహరించేలా వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. కేసుల ఉపసంహరణలో న్యాయపరమైన సమస్యలు రాకుండా చూసుకోవాలన్నారు. న్యాయశాఖ అధికారులు ఇందుకు తగిన సూచనలు చేయాలని వెల్లడించారు.
News April 7, 2025
పి -4 సర్వే పనులు వేగవంతం చేయాలి: జేసీ

శ్రీసత్యసాయి జిల్లాలో పి-4 సర్వే పనులు వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన ప్రజల నుంచి 220 అర్జీలు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ కమిషన్ నుంచి వచ్చిన వినతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించే విధంగా కృషి చేయాలన్నారు.