News January 29, 2025
సీపీఎం రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యురాలిగా నర్సమ్మ

మెదక్ జిల్లాకు చెందిన సీపీఎం సీనియర్ నాయకురాలు కడారి నర్సమ్మ.. పార్టీ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సీపీఎం రాష్ట్ర 4వ మహాసభల్లో బుధవారం ఆమెను రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యురాలుగా నియమిస్తూ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని నర్సమ్మ అన్నారు.
Similar News
News November 4, 2025
మెదక్: రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు నిజాంపేట విద్యార్థి ఎంపిక

రాష్ట్రస్థాయి రగ్బీ క్రీడా పోటీలకు నిజాంపేట మండలానికి చెందిన విద్యార్థి కార్తీక్ గౌడ్ ఎంపికయ్యాడు. తూప్రాన్‌లోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ గ్రౌండ్లో జరిగిన 69వ ఎస్జీఎఫ్ అండర్-17 ఉమ్మడి మెదక్ జిల్లా రగ్బీ సెలక్షన్లో కార్తీక్ గౌడ్ ఎంపికైనట్లు జడ్పీ హైస్కూల్ హెచ్ఎం జ్ఞానమాల, పీడీ ప్రవీణ్ తెలిపారు. విద్యార్థి ఎంపిక పట్ల ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేసింది.
News November 4, 2025
మెదక్ జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష

మెదక్ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్లో సోమవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆయా శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఏవైనా అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడితే సహించేది లేదన్నారు. అవినీతి అనేది పెద్ద నేరమని, ఎవరికైనా అలాంటి ఆలోచనలు ఉంటే మానుకోవాలని హెచ్చరించారు. ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
News November 3, 2025
మెదక్: ప్రజావాణిలో 77 దరఖాస్తులు

మెదక్ కలెక్టరెట్లోని ప్రజావాణిలో మొత్తం 77 దరఖాస్తులు స్వీకరించినట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. వీటిల్లో భూ సమస్యలకు సంబంధించి 36, పింఛన్లకు సంబంధించి 07, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 07, దరఖాస్తులు వచ్చాయన్నారు. మిగిలిన 27 దరఖాస్తులు ఇతర సమస్యలకు సంబంధించినవని పేర్కొన్నారు. ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.


