News March 10, 2025
సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సత్యం నామినేషన్ దాఖలు

ఎమ్మెల్యే కోటా సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తం, అద్దంకి దయాకర్, సీపీఐ నాయకుల బృందం పాల్గొన్నారు. సీపీఐ పార్టీకి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వడం పట్ల కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధిష్టానానికి కృతజ్ఞతలు చెప్పారు.
Similar News
News March 11, 2025
మందమర్రి: యాక్సిడెంట్.. నేరస్థుడికి జైలు శిక్ష

యాక్సిడెంట్ కేసులో నేరస్థుడికి 18నెలల జైలు, రూ.8వేల జరిమానా విధిస్తూ మొదటి అదనపు జ్యుడీషియల్ జడ్జి విధించినట్లు SIరాజశేఖర్ తెలిపారు. SI కథనం ప్రకారం.. 2016లో మందమర్రి కానిస్టేబుల్ శ్రీధర్ బైక్‌పై వెళ్తున్నారు. వెనుక నుంచి అజాగ్రత్తగా వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. శ్రీధర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసులో సాక్షులను విచారించిన జడ్జి నిందితుడు లారీ డ్రైవర్ సుధాకర్ రెడ్డికి జైలు శిక్ష విధించారు.
News March 11, 2025
ఇల్లందు: సకల సదుపాయాలతో ప్రభుత్వాసుపత్రి భవన నిర్మాణం

ఇల్లందు పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో రూ.38 కోట్లతో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి, రూ.11 కోట్ల 50 లక్షలతో ప్రభుత్వ ఐటీఐ కాలేజీ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పట్టణంలో ఆయా భవన నిర్మాణాల కోసం సేకరించిన స్థలాలను భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వీ.పాటిల్‌తో ఎమ్మెల్యే కోరం కనకయ్య సోమవారం పరిశీలించారు. వారివెంట ఏరియా జీఎం వీ.కృష్ణయ్య, ఎమ్మార్వో రవికుమార్ ఉన్నారు.
News March 11, 2025
బాడీ బిల్డింగ్ పోటీల్లో మందమర్రి కుర్రాడి విజయం

మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాడీ బిల్డింగ్ పోటీల్లో మందమర్రికి చెందిన అక్షయ్ విజేతగా నిలిచారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 100 మందికి పైగా పోటీలో పాల్గొన్నారు. అక్షయ్ 70 విభాగంలో తన ప్రతిభ చాటి మొదటి బహుమతి కైవసం చేసుకున్నారు. పట్టణవాసులు పలువురు ఆయనను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.