News August 23, 2025
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా హేమంతరావు

CPI రాష్ట్ర సమితి కార్యదర్శివర్గ సభ్యుడిగా జిల్లాకు చెందిన బాగం హేమంతరావు ఎన్నికయ్యారు. మూడు రోజులపాటు మేడ్చల్ జిల్లా గాజులరామవరంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలో ఈ ఎన్నిక జరిగింది. నేలకొండపల్లి మండలం మోటాపురంలో రైతు కుటుంబంలో జన్మించిన బాగం హేమంతరావు విద్యార్థి ఉద్యమంలో పనిచేశారు. ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి, ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.
Similar News
News November 6, 2025
వెట్‌ల్యాండ్‌లలో నిర్మాణాలు నిషేధం: అదనపు కలెక్టర్

వెట్‌ల్యాండ్‌ల సంరక్షణ ద్వారానే పర్యావరణానికి మేలు జరుగుతుందని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్‌లో వెట్‌ల్యాండ్ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో 467 వెట్ ల్యాండ్‌లు 8,911 హెక్టార్లలో ఉన్నట్లు పేర్కొన్నారు. వాటిల్లో నిర్మాణాలు చేపట్టడం, వ్యర్థాలు వేయడం నిషేధమని ఆయన తెలిపారు. భూ యాజమాన్యం మారదనే విషయాన్ని రైతులు గమనించాలని, ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు.
News November 6, 2025
టేకులపల్లి ఐటీఐలో నవంబర్ 7న జాబ్ మేళా

భారత్ హ్యుండాయ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 24 ఉద్యోగాల భర్తీకి నవంబర్ 7న ఉదయం 10 గంటలకు ఖమ్మంలోని టేకులపల్లి ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. డిగ్రీ అర్హతతో సేల్స్ కన్సల్టెంట్స్ (రూ.18,000), డీజిల్ మెకానిక్ లేదా బిటెక్ అర్హతతో సర్వీస్ అడ్వయిజరీ (రూ.12,000) పోస్టులు ఉన్నాయని చెప్పారు.
News November 5, 2025
చేప పిల్లల పంపిణీ పక్కాగా జరగాలి: ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శ్రీజ

ఖమ్మం జిల్లాలో చేప పిల్లల పంపిణీ, విడుదల పక్కాగా జరగాలని ఇన్‌ఛార్జ్ జిల్లా కలెక్టర్ డా. పి. శ్రీజ మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 882 చెరువుల్లో ఉచితంగా చేప పిల్లల పంపిణీ జరుగుతుందన్నారు. నవంబర్ 6 నాటికి మండల, గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. కాలుష్యం ఉన్న చెరువుల్లో చేప పిల్లలు వేయవద్దని, వివరాలను టీ-మత్స్య యాప్‌లో నమోదు చేయాలని సూచించారు.


