News March 15, 2025
సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన వరంగల్ కలెక్టర్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన సీపీగా బాధ్యతలు చేపట్టిన సన్ ప్రీత్ సింగ్‌ను వరంగల్ కలెక్టర్ డా. సత్య శారదా దేవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం ఇరువురు అధికారులు పలు అంశాలతో పాటు పోలీస్, రెవెన్యూ అధికారులు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించుకున్నారు.
Similar News
News November 3, 2025
విశాఖలో దంపతుల మృతిపై వీడని మిస్టరీ

అక్కయ్యపాలెం సమీపంలో భార్యాభర్తలు వాసు, అనిత <<18182096>>మృతిపై<<>> పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఘటనాస్థలంలో బెడ్‌పై అనిత మృతదేహం, వాసు ఉరితాడుకు వేలాడడం అనుమానాలకు తావిస్తోంది. భార్యను చంపిన అనంతరం వాసు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక వేరే ఏదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల వివాహం జరగగా వారి మధ్య ఎలాంటి గొడవలు లేవని బంధువులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
News November 3, 2025
ఘోర ప్రమాదాలు.. 10 రోజుల్లో 60 మంది దుర్మరణం!

దేశంలో రోడ్డు ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత పది రోజుల్లో జరిగిన వేర్వేరు ఘోర ప్రమాదాల్లో దాదాపు 60మంది దుర్మరణం పాలయ్యారు. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు మరణించారు. ఇంతకుముందు కర్నూలులో 20, రాజస్థాన్‌లో 15, బాపట్లలోని సత్యవతిపేట వద్ద జరిగిన కారు ప్రమాదంలో 4 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస ఘటనలు ప్రయాణ భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
News November 3, 2025
వేగం వద్దు బ్రదర్.. DRIVE SAFE

వరుస రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా చలికాలంలో పొగమంచు కారణంగా రోడ్డు సరిగా కనిపించదు. ఈ సమయంలో అతివేగం అత్యంత ప్రమాదకరం. ‘కాస్త ఆలస్యం అయినా ఫర్వాలేదు.. మీ గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకోవడమే ముఖ్యం’ అని వారు సూచిస్తున్నారు. డ్రైవర్లు నిర్ణీత వేగ పరిమితి పాటించాలని, సురక్షిత దూరాన్ని కొనసాగించాలని అవగాహన కల్పిస్తున్నారు.


