News November 22, 2024

సీమ ప్రజల ఆకాంక్ష నెరవేరుతోందా?

image

కర్నూలు.. ఆంధ్ర రాష్ట్రానికి తొలి రాజధాని. 1953 అక్టోబరు 1 నుంచి 1956 అక్టోబరు 31 వరకు రాజధానిగా కొనసాగింది. 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు కావడంతో HYDను రాజధానిని చేశారు. దీంతో కర్నూలుకు నిరాశ ఎదురైంది. 8 జిల్లాలు, 1.59 కోట్ల మంది జనాభా ఉన్న సీమకు ఏళ్లుగా అన్యాయం జరుగుతోందన్న భావన ప్రజల్లో ఉంది. తాజాగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో హర్షం వ్యక్తమవుతోంది.

Similar News

News November 22, 2024

PAC, అంచనాల కమిటీ సభ్యులుగా కర్నూలు జిల్లా MLAలు

image

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు MLA డా.బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ప్రజా పద్దుల కమిటీ(PAC) సభ్యునిగా ఎన్నికయ్యారు. అటు అంచనాల కమిటీ సభ్యులుగా ఆళ్లగడ్డ, ఆదోని MLAలు భూమా అఖిలప్రియ, డా.పార్థసారథి ఎన్నికయ్యారు. కాసేపటి క్రితమే అసెంబ్లీ కమిటీల ఎన్నికలకు కౌంటింగ్ పూర్తికాగా అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు గెలుపొందిన సభ్యుల వివరాలను ప్రకటించారు.

News November 22, 2024

కర్నూలు జిల్లాలో క్షుద్ర పూజల కలకలం

image

ఆస్పరి మండలం హలిగేర గ్రామంలోని ఓవర్ హెడ్ ట్యాంక్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారని స్థానికులు ఆరోపించారు. పసుపు, కుంకుమ, టెంకాయలతో పూజలు చేశారన్నారు. సమీపంలో పాఠశాల ఉండటంతో పిల్లలు సైతం భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

News November 22, 2024

పత్తికొండ డివిజన్‌లో పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహించండి: కలెక్టర్

image

పత్తికొండలో రెవెన్యూ డివిజనల్ స్థాయి సమావేశం కలెక్టర్ రంజిత్ బాషా ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. పత్తికొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో బత్తాయి తోటల పెంపకాన్ని ప్రోత్సహించాలని, బత్తాయి పెంపకంలో అనంతపురం జిల్లా రైతులను ఆదర్శంగా తీసుకోవాలని రైతులను కోరారు. డ్రిప్ పండ్లతోటల ద్వారా మంచి దిగుబడిన సాధించిన రైతుల విజయ గాథలను రైతులకు వీడియోల ద్వారా తెలిపి ప్రోత్సహించాలని కోరారు.