News December 29, 2025
సీరియల్ నటి నందిని ఆత్మహత్య

ప్రముఖ కన్నడ-తమిళ్ సీరియల్ నటి నందిని(26) సూసైడ్ చేసుకున్నారు. బెంగళూరులోని తన ఫ్లాట్‌లో ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమిళ్‌లో పాపులర్ అయిన ‘గౌరీ’ సీరియల్‌లో దుర్గ, కనకగా ఆమె డబుల్ రోల్‌లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నందిని పెళ్లి విషయంలో పేరెంట్స్ ఒత్తిడి చేయడంతోనే సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
Similar News
News February 11, 2026
లోక్‌సభలో రగడ.. అసలు రాహుల్ ఏమన్నారంటే?

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో మాట్లాడుతూ ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రస్తావన తేవడం రాజకీయ దుమారం రేపింది. ‘ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో పేరున్న పారిశ్రామికవేత్త అనిల్ అంబానీని ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? అసలు ఎప్‌స్టీన్‌కు అనిల్‌ను పరిచయం చేసిందెవరో కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ పురికి తెలుసు’ అని రాహుల్ వ్యాఖ్యానించడంతో బీజేపీ తీవ్ర అభ్యంతరం తెలిపింది.
News February 11, 2026
MLAల ప్రసంగాలు వింటా.. మంత్రుల సమాధానాలు చూస్తా: CBN

AP: 20నెలల కూటమి పాలనలో విభేదాలు లేవని CM CBN అన్నారు. ‘మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. నిబద్ధత లేకపోతే ఫలితాలు రావు. పెండింగ్ పనులను నా దృష్టికి తీసుకురండి. జిల్లాల వారీగా నేతలు, అధికారులతో సమావేశం పెడతా. అసెంబ్లీ సమావేశాలను సీరియస్‌గా తీసుకోవాలి. 9am-1pm వరకు సభ్యులంతా సభలో ఉండాలి. MLAల ప్రసంగాలు వింటా..మంత్రుల సమాధానాలు చూస్తా. అసెంబ్లీని నేను కూడా పూర్తిగా గమనిస్తా’ అని CM చెప్పారు.
News February 11, 2026
శివరాత్రి స్పెషల్.. RTC బస్సు ఛార్జీల పెంపు

శివరాత్రి సందర్భంగా TGSRTC 2,243 స్పెషల్ బస్సులు నడుపుతోంది. వీటిలో శ్రీశైలానికి 781, వేములవాడకు 416, కీసరకు 326 ఉన్నాయి. దీంతో స్పెషల్ బస్సుల్లో టికెట్ రేట్లను సంస్థ 1.5రెట్లు పెంచింది. ఈ నెల 14 నుంచి 16 వరకు ఇది అమల్లో ఉండనుంది. రెగ్యులర్ సర్వీసుల్లో ఎలాంటి మార్పు ఉండదు. స్పెషల్ పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో మహిళలకు యథావిధిగా ఫ్రీ జర్నీ అమల్లో ఉంటుంది.


