News February 5, 2025
సీరోల్: డాన్స్ చేస్తూ విద్యార్థిని కుప్పకూలి మృతి

మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో బుధవారం డాన్స్ చేస్తూ ఓ విద్యార్థిని కుప్పకూలి మృతి చెందింది. స్థానిక విద్యార్థులు తెలిపిన వివరాలు.. ఇంటర్ విద్యార్థిని రోజా డాన్స్ చేస్తూ కుప్పకూలింది. వెంటనే బాలిక తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు సమాచారం ఇచ్చి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందినట్లు వారు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 28, 2026
అడ్డతీగల: సీపీఆర్ చేసి ప్రాణాలు నిలిపిన డాక్టర్

అడ్డతీగల మండలంలో జరిగిన కారు ప్రమాదంలో క్షతగాత్రులకు సీపీఆర్ చేసి ఆ డాక్టర్ ప్రాణదాతగా నిలిచారు. మిట్లపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులకు తీవ్రగాయాలు అవ్వగా, ఆ సమయంలో అటుగా వెళ్తున్న జడ్డంగి వైద్యాధికారిని పావని వారికి సీపీఆర్ చేసి అడ్డతీగల ఆసుపత్రికి పంపించారు. కాగా ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. డాక్టర్ పావని సీపీఆర్ చేసి ఉండకపోతే మరణాలు సంఖ్య పెరిగేదని స్థానికులు తెలిపారు.
News February 28, 2026
నల్గొండ: పన్ను వసూళ్ల ‘డెడ్ లైన్’.. 32 రోజులే గడువు

మున్సిపాలిటీల్లో పన్ను వసూలుకు గడువు ముంచుకొస్తోంది. ఫిబ్రవరి ముగుస్తుండగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 32 రోజుల గడువు మాత్రమే మిగిలిఉంది. అయినా జిల్లాలోని NLG, MLG, DVK, HLY, CTL CDR, NKL, నందికొండ మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. JAN, FEBలో మున్సిపల్ ఎన్నికల హడావిడితో అధికారులు, సిబ్బంది పన్నుల వసూళ్లపై దృష్టి సారించలేకపోయారు. దీంతో బల్దియాల్లో బకాయిలు పేరుకుపోయాయి.
News February 28, 2026
BOB క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అప్లైకి గడువు పెంపు

BOB క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు అప్లై చేయడానికి మార్చి 15 వరకు గడువును పొడిగించారు. మేనేజర్, AVP ఫైనాన్స్& అకౌంట్స్, స్టేట్ హెడ్ రిటైల్ బ్రోకింగ్ పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు careers@bobcaps.in ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, PG/CA/MBA అర్హతతో పాటు పనిఅనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.bobcaps.in


