News August 6, 2024

సీలేరు పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుపై సర్వే

image

సీలేరు పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుపై జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా బృందం విస్తృతంగా సర్వే నిర్వహించింది. ఢిల్లీ నుంచి వచ్చిన జియోలాజికల్‌ సర్వే బృందం స్థానిక ఎస్ఈ చంద్రశేఖరరెడ్డితో కలిసి తొమ్మిది ప్రాంతాలను సందర్శించింది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వ్యాప్‌కోస్‌ సంస్థ తయారు చేసిన డీపీఆర్‌ ఆధారంగా పరిశీలన చేసింది. జీఎస్‌ఐ సభ్యులకు ప్రాజెక్టు గురించి ఎస్ఈ చంద్రశేఖరరెడ్డి వివరించారు

Similar News

News July 6, 2025

గిరి ప్రదక్షిణకు ట్రాఫిక్ రూల్స్-3

image

➥ శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి అనకాపల్లి వైపు వచ్చే ప్రైవేటు ట్రావెల్ బస్సులు, RTC బస్సులు, ఇతర వాహనదారులు ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా అనకాపల్లి చేరుకోవాలి.
➥ గిరిప్రదక్షిణకు వచ్చు భక్తుల రద్దీ దృష్ట్యా విశాలాక్షి నగర్ బీచ్ రోడ్ జంక్షన్ నుంచి కురుపాం బీచ్ రోడ్ జంక్షన్ వరకు వాహనములు అనుమతించరు.
➥హనుమంతువాక జంక్షన్, వెంకోజీపాలెం జంక్షన్ వద్ద భక్తుల రద్దీ ఉంటుంది.

News July 6, 2025

గిరి ప్రదక్షిణ ట్రాఫిక్ రూల్స్- 4

image

➣జోడుగుల్లపాలెం జంక్షన్ నుంచి హనుమంతవాక జంక్షన్ వైపునకు, హనుమంతవాక జంక్షన్ నుంచి జోడుగుల్లపాలెం జంక్షన్ వైపునకు వాహనములు అనుమతించరు. ఆ ప్రాంతీయులు విశాలాక్షినగర్ మెయిన్ రోడ్డు గుండా ప్రయాణించి SBI జంక్షన్ వద్ద జాతీయ రహదారి చేరుకోవాలి.
➣సీతమ్మధార, అల్లూరి సీతారామరాజు స్టాట్యూ నుంచి వెంకోజిపాలెం జంక్షన్ వైపు వాహనాలు అనుమతించరు.
➣వెంకోజిపాలెం జంక్షన్ నుంచి అపుఘర్ జంక్షన్ వైపు వాహనాలకు నో ఎంట్రీ.

News July 6, 2025

సింహాచలం గిరి ప్రదక్షిణకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

image

గిరి ప్రదక్షిణ రూట్లో వాహనాల రాకపోకలను నిషేధిస్తూ ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసు కమిషనర్ శంఖ‌బ్రత బాగ్చి తెలిపారు. 9వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు. గిరి ప్రదక్షణలో పాల్గొనే భక్తులు వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు నిర్దేశిత ప్రాంతాలను గుర్తించామని తెలిపారు.