News December 20, 2025
సీసీఎంబీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

హైదరాబాద్‌లోని CCMB 9 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 29 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, BSc, డిప్లొమా, MSc (నేచురల్ సైన్స్), BE, B.Tech, PhD (బయోఇన్ఫర్మాటిక్స్/జెనిటిక్స్/లైఫ్ సైన్స్, జీనోమిక్స్, మైక్రో బయాలజీ)ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.ccmb.res.in
Similar News
News December 29, 2025
హాదీ హంతకులు ఇండియాలోకి రాలేదు: BSF

బంగ్లాదేశ్‌లో ఇంక్విలాబ్ మంచ్ లీడర్ ఉస్మాన్ హాదీని హత్య చేసిన వాళ్లు ఇండియాలోకి <<18694542>>ప్రవేశించారన్న<<>> ఢాకా పోలీసుల వాదనలను బీఎస్ఎఫ్ కొట్టిపారేసింది. ఆ ఆరోపణల్లో నిజం లేదని, నిందితులు బార్డర్ దాటినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఇది తప్పుదారి పట్టించే ప్రయత్నమని బీఎస్ఎఫ్ ఐజీ ఉపాధ్యాయ్ అన్నారు. హలువాఘాట్ సెక్టార్ నుంచి మేఘాలయలోకి ప్రవేశించినట్లు రిపోర్టులేమీ రాలేదని తెలిపారు.
News December 29, 2025
4G బుల్లెట్ సూపర్ నేపియర్ గడ్డి ప్రత్యేకతలివే..

4G బుల్లెట్ సూపర్ నేపియర్ పశుగ్రాసంలో దీనిలో తీపిదనం ఎక్కువ. దీని కాండం ముదిరినా లోపల డొల్లగా ఉండటం వల్ల పశువులు సులువుగా, ఇష్టంగా తింటాయి. ఎకరం గడ్డి 10 ఆవులకు సరిపోతుంది. దీనిలో ప్రొటీన్ కంటెంట్ 16-18 శాతంగా ఉంటుంది. ఫైబర్ కూడా ఎక్కువ. దీని వల్ల పశువుల్లో పాల ఉత్పత్తి మరింత పెరుగుతుంది. ఈ గడ్డి చాలా గుబురుగా, దీని ఆకులు మృదువుగా ఉండటం వల్ల రైతులు కోయడం కూడా సులభం.
News December 29, 2025
ఇవాళ, రేపు జాగ్రత్త!

TG: రాబోయే రెండు రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణశాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెల్లవారుజాము, రాత్రి వేళల్లో అవసరం అయితేనే బయటకు రావాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


