News February 27, 2025

సీసీ కెమెరాలతో పర్యవేక్షణ: బాపట్ల ఎస్పీ

image

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బాపట్ల పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను ఎస్పీ తుషార్ డూడి పరిశీలించారు. మున్సిపల్ హై స్కూల్ ప్రాంగణాన్ని పరిశీలించి పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామని.. సీసీ కెమెరాలు ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. ఆయన వెంట డీఎస్పీ రామాంజనేయులు పాల్గొన్నారు.

Similar News

News December 19, 2025

కామారెడ్డి: బడా నేతల స్వగ్రామాల్లో చుక్కెదురు

image

కామారెడ్డి జిల్లాలో GP ఎన్నికల్లో ప్రజలు వినూత్న తీర్పునిచ్చారు. మాజీ MLA గంప గోవర్ధన్ స్వగ్రామం బస్వాపూర్‌లో తుడుం పద్మ(కాంగ్రెస్), మాజీ MLA ఏనుగు రవీందర్ రెడ్డి స్వగ్రామం ఎర్రపహాడ్‌లో సొంఠికీ మల్లవ్వ(BJP), కామారెడ్డి ఎమ్మెల్యే కేవీ రమణా రెడ్డి స్వగ్రామం దేమికలాన్‌లో కటకం భార్గవి(BRS) గెలిచారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇలాకాలో పోతుగంటి సంతోష్ రెడ్డి(స్వతంత్ర అభ్యర్థి) విజయం సాధించారు.

News December 19, 2025

వనపర్తి: తాగునీటికి ఓకే.. సాగుకు లేదు

image

జూరాల ఎడమ కాలువ కింద పెబ్బేరు, శ్రీరంగాపూర్, వీపనగండ్ల మండలాలకు చెందిన రైతులకు 2025-26 రబీ సీజన్‌కు సాగునీటి సరఫరా ఉండదని డివిజన్-3 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ భావన భాస్కర్ తహసీల్దార్లకు సర్క్యులర్ జారీ చేశారు. రానున్న రబీ సీజన్‌లో ఎడమ కాల్వ కింద సాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. తాగునీటి నిల్వల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు.

News December 19, 2025

వేములవాడ: 21 నుంచి మోడ్రన్ కబడ్డీ జట్ల ఎంపిక

image

వేములవాడ మండలం హనుమాజీపేటలోని ప్రభుత్వ పాఠశాలలో ఈనెల 21న మోడ్రన్ కబడ్డీ జట్ల ఎంపిక జరుగుతుందని మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు నాంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు వేములవాడలో శుక్రవారం ఆయన నోట్ విడుదల చేశారు. ఈ కబడ్డీ జట్ల ఎంపికలో పాల్గొనేవారు 85 కేజీలలోపు బరువు ఉండాలని సూచించారు. జట్ల ఎంపికకు వచ్చేవారు తమ వెంట ఆధార్ కార్డు తీసుకురావాలని పేర్కొన్నారు.