News April 3, 2025
సుంకేసుల డ్యామ్ ఘటన.. మృతులు వీరే!

కర్నూలు జిల్లా సుంకేసుల డ్యామ్ వద్ద నిన్న విషాద ఘటన జరిగిన విషయం తెలిసిందే. నగరానికి చెందిన సులేమాన్ (47) తన కుమార్తెకు పదో తరగతి పరీక్షలు ముగియడంతో కుటుంబ సభ్యులతో కలిసి డ్యామ్ వద్దకు వెళ్లారు. తన కుమారులు ఫర్హాన్ (13), ఫైజాన్ (9)తో కలిసి ఈత కొట్టేందుకు నదిలోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో గల్లంతయ్యారు. కాసేపటి తర్వాత మృతదేహాలు బయటపడ్డాయి. ఘటనపై గూడూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News April 4, 2025
కర్నూలు: ‘న్యాయవాదులకు స్టాంపుల కొరత రానివ్వం’

న్యాయవాదులకు కోర్టు స్టాంపుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ నూతన అధ్యక్ష, కార్యదర్శులు హరినాథ్ చౌదరి, వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గురువారం జిల్లా కోర్టు ఆవరణలోని కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం కార్యాలయంలో అధ్యక్ష, కార్యదర్శులుగా హరినాథ్ చౌదరి, వెంకటేశ్వర్లు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. న్యాయవాదుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
News April 3, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యంశాలు.!

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు.➤కొత్త జంటకు YS జగన్ ఆశీర్వాదం➤కమిటీల్లో అన్ని వర్గాలకు చోటు: YCPనేతలు➤బ్యాడిగ మార్కెట్లో వర్షం.. తడిసిన మిరప➤ కర్నూలు: పిడుగు పాటుతో బాలుడి మృతి➤ నంది అవార్డు గ్రహీతకు సబ్ కలెక్టర్ అభినందన➤ భూములను కబ్జా చేయడానికి వక్ఫ్ సవరణ: మాజీ MLA హఫీజ్➤ కర్నూలు: నాయకులతో జగన్ సెల్ఫీ.!➤ జిల్లాలో దంచికొట్టిన వర్షాలు➤కౌతాళంలో సబ్ కలెక్టర్ పర్యటన.
News April 3, 2025
కర్నూలు: పిడుగు పాటుతో బాలుడి మృతి

కర్నూలు జిల్లాలో గురువారం విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎమ్మిగనూరు మండలం కందనాతిలో రవి(15) పొలం పనులు చేస్తున్నాడు. మెరుపులతో బాలుడి సమీపంలో పిడుగు పడింది. దీంతో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితోపాటు పొలంలో పనిచేస్తున్న పలువురికి గాయాలు కాగా వారిని వెంటనే ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రవి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.