News July 26, 2024
సుంకేసుల నుంచి 2,095 క్యూసెక్కుల నీరు విడుదల

కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం నుంచి నీటిని విడుదల చేయడంతో.. రాజోలి శివారులో ఉన్న సుంకేసుల జలాశయం అధికారులు గురువారం ముందస్తుగా నీటిని దిగువకు విడుదల చేశారు. ఎలాంటి ఇన్ ఫ్లో నమోదు కానప్పటికీ, రెండు గేట్ల ద్వారా దిగువకు 2,095 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లుగా జేఈ రాజు తెలిపారు. డ్యాం మొత్తం నీటిమట్టం 292.00 మీటర్లు ఉండగా, ప్రస్తుతం 290.90 మీటర్లుగా నమోదైనట్లుగా ఆయన పేర్కొన్నారు.
Similar News
News November 8, 2025
MBNR: ఈనెల 10, 11న ఖో-ఖో ఎంపికలు

మహబూబ్‌నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14, అండర్-17 బాల, బాలికల ఖో-ఖో జట్ల ఎంపికలను డీఎస్ఏ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి డాక్టర్ ఆర్. శారదాబాయి తెలిపారు. ఈ నెల 10న అండర్-14, 11న అండర్-17 ఎంపికలు జరుగుతాయన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు బోనఫైడ్, ఆధార్ జిరాక్స్‌లతో ఉదయం 9 గంటలలోపు పీడీ మొగులాల్ (99859 05158)ను సంప్రదించాలని సూచించారు.
News November 7, 2025
హిందువులు సత్తా చాటాలి: MP డీకే అరుణ

2 లక్షలకు పైగా ఉన్న హిందువులంతా ఏకమై జూబ్లీహిల్స్ ఊప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించి సత్తా చాటాలని ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా బోడబండలో నిర్వహించిన బహిరంగ సభలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి చేయలేదని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి శూన్యమని ఆమె విమర్శించారు.
News November 7, 2025
దళితులైతే దాడులు చేస్తారా?: మందకృష్ణ మాదిగ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయిపై కాలు, బూటుతో దాడి చేయడాన్ని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్రంగా ఖండించారు. ఆయన దళితుడు అయినందువల్లే ఇలాంటి దాడులకు పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 17న నిర్వహిస్తున్న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని పీయూ నుంచి భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


