News September 2, 2025

సుందరీకరణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

కర్నూలులో చేపడుతున్న సుందరీకరణ పనులను ఈనెల 30 నాటికి పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. మంగళవారం నగరంలోని సిల్వర్ జూబ్లీ కళాశాల, విజ్ఞాన మందిర్, బంగారు పేట, తదితర ప్రాంతాల్లో కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణం, సుందరీకరణ పనులను కలెక్టర్ పరిశీలించారు. నిధులు మంజూరు చేసి 6 నెలలు అయినా పనులు పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Similar News

News September 3, 2025

ఈనెల 4న కర్నూలులో ట్రాఫిక్ మళ్లింపు: ఎస్పీ

image

ఈనెల 4న కర్నూలులో 730 వినాయక విగ్రహాల నిమజ్జనం ఊరేగింపును పురస్కరించుకొని ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సులు బళ్లారి చౌరస్తా మీదుగా నంద్యాల చెక్ పోస్ట్ వైపు రాకపోకలు సాగిస్తాయన్నారు. బస్టాండ్ నుంచి రాజ్ విహార్, ప్రభుత్వ అసుపత్రి, వినాయక ఘాట్, గాయత్రి ఎస్టేట్ మీదుగా వాహనాలను నిషేధించినట్లు వెల్లడించారు. నగర ప్రజలు సహకరించాలన్నారు.

News September 3, 2025

ఈ నెల 6న కర్నూలులో జిల్లాస్థాయి మారథాన్ పోటీలు

image

ఈనెల 6న ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు కర్నూలులో జిల్లాస్థాయి మారథాన్ 5 కిలోమీటర్ల పరుగు పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ భాస్కర్ వెల్లడించారు. కర్నూలులోని స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో క్రీడా అధికారులతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. 17 నుంచి 25 ఏళ్లు కలిగిన విద్యార్థులు, యువకులు, మహిళలు పాల్గొనవచ్చన్నారు. కార్యక్రమంలో డీఎస్డీఓ భూపతి పాల్గొన్నారు.

News September 2, 2025

పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యత: ఏఎస్పీ

image

పోలీసుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖ ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తోందని అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మృతి చెందిన ఆరు హోంగార్డు కుటుంబాలకు అడిషనల్ ఎస్పీ రూ.2 లక్షల ప్రకారం కాంట్రిబ్యూషన్ వెల్ఫేర్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా పోలీసు కుటుంబాలకు రావలసిన బెనిఫిట్స్ త్వరితగతిన అందజేస్తామన్నారు.